రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెండాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం దామరచెర్వు గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
రామాయంపేట, న్యూస్‌లైన్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెండాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం దామరచెర్వు గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగింది. స్థానిక ఏఎస్‌ఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం...
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన మహ్మద్ యూనస్(43) సోమవారం తన కూతురిని అత్తగారింట్లో దింపేందుకు నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి వెళ్లాడు. తిరిగి సరూర్‌నగర్ వెళ్తున్న క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రామాయంపేట బైపాస్‌లో బస్సు దిగి, పట్టణ శివారులోని దామరచెర్వు 44వ జాతీయ రహదారిపై నడుచుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యూనస్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఏఎస్‌ఐలు మురళి, బాలక్రిష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మృతుని కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈ మేరకు కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ మురళి తెలిపారు.