విద్యార్థినికి మత్తు మందిచ్చి..అశ్లీల ఫొటోలు | auto driver crime in ramayam pet | Sakshi
Sakshi News home page

విద్యార్థినికి మత్తు మందిచ్చి..అశ్లీల ఫొటోలు

Published Fri, Aug 7 2015 10:11 PM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

auto driver crime in ramayam pet

రామాయంపేట: ఆటో ఎక్కిన విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి అసభ్యకర రీతిలో ఫొటోలు తీసి వాటిని తన స్నేహితులకు పంపించిన ఆటో డ్రైవర్ పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. స్థానిక ఎస్‌ఐ నాగార్జునగౌడ్ కథనం మేరకు.. కోనాపూర్‌కు ఎందిన ఓ విద్యార్థిని రామాయంపేటలో ఇంటర్ చదువుతోంది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం కోనాపూర్ వెళ్లడానికి రామాయంపేటలో ఆటో ఎక్కింది.

డ్రైవర్ జాష్వా పథకం ప్రకారం.. ఆటోను కోనాపూర్ వద్ద ఆపకుండా నేరుగా నిజాంపేట గ్రామ శివారులోకి తీసుకెళ్లి ఆమెకు మత్తుమందు ఇచ్చి అసభ్యకర రీతిలో తన సెల్ ఫోన్‌తో ఫొటోలు తీసుకున్నాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి నిజాంపేటలో దింపి వెళ్లిపోయాడు. కాగా జాష్వా స్నేహితుడైన కుమార్ ఈ ఫొటోలను బ్లూటూత్ ద్వారా తన స్నేహితులకు పంపగా బాధితురాలైన విద్యార్థినికి విషయం తెలిసింది. ఈ మేరకు శుక్రవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement