సమగ్ర సర్వే కొచ్చిన ఉద్యోగులపై దాడి! | Young man attacked Employees who came to Intensive household Survey | Sakshi
Sakshi News home page

సమగ్ర సర్వే కొచ్చిన ఉద్యోగులపై దాడి!

Published Mon, Aug 18 2014 6:37 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

Young man attacked Employees who came to Intensive household Survey

రామాయంపేట: సమగ్ర సర్వే కోసం వచ్చిన ఉద్యోగులపై ఓ యువకుడు దాడి చేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 
 
తాగిన మైకంలో యువకుడు ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసినట్టు తెలిసింది. దాడి చేసిన యువకుడిపై ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement