రామాయంపేట, న్యూస్‌లైన్: కరెంట్ కోతలపై రైతులు, ప్రజలు కన్నెర్రచేశా రు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో కార్యాలయంను ముట్టడించారు. కోతలను ఎత్తివేయాలంటూ ధర్నా చేపట్టారు. బుధవారం రామాయంపేట మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బీ అతిథిగృహం నుండి రైతులు, ప్రజలు ర్యాలీగా బయలుదే ట్రాన్స్‌కో కార్యాలయం ము ట్టడించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలతోపాటు పట్టణంలో విద్యుత్ కోతలు అధికమయ్యాయని పేర్కొన్నారు.
గ్రామాల్లో రైతులకు నిరంతరాయంగా ఏ డు గంటల కరెంటు సరఫరా చేయకుండా నాలుగు గంటలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో ఉద యం 10 గంటల నుండి 12 గంటల వర కు, సాయంత్రం 4 గంటల నుండి 6 గం టల వరకు కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు. కాగా అదనంగా మరో రెండు గంటలు ఎల్‌సీల పేరిట కరెంటు కోతలు విధిస్తున్నారన్నారు. ఇప్పటికైనా రైతులకు, ప్రజలకు నాణ్యమైన కరెంటు సరఫరా చేయాలని లేకుంటే త్వరలో డీఈ కార్యాలయం ముట్టడిస్తామని హె చ్చరించారు.
అనంతరం ఎస్‌ఈతో ప ద్మా దేవేందర్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడి కరెంటు సమస్యను అడిగి తెలుసుకున్నా రు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, మాజీ ఎంపీపీలు పుట్టి విజయలక్ష్మీ, గుండా ఎల్లం, బిజ్జ సంపత్, టిఆర్‌ఎస్ జిల్లా యూత్ ప్రధా న కార్యదర్శి అందె కొండల్ రెడ్డి, రామాయంపేట, నిజాంపేట, తొనిగండ్ల, దం తేపల్లి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, జాన్సీలింగాపూర్ సర్పంచ్‌లు ప్రభావతి, తిర్మల్‌గౌడ్, పిట్ల శామయ్య, గొల్ల గాలవ్వ నారాయణ, మానెగల్ల రామకిష్టయ్య, రామాయంపేట ఉప సర్పంచ్ నాగేశ్వర్ రె డ్డి, చిలుక గంగాధర్, వార్డు సభ్యులు పోచమ్మల పద్మ, పోచమ్మల ఐలయ్య, చింతల ఏసుపాల్, బాదె చంద్రం, మల్లారెడ్డి, సుభాష్, అక్కన్నపేట మాజీ సర్పంచ్ జంగం సిద్ధరాంలు, ఉప సర్పంచ్ కమ్మరి ప్రభాకర్, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
కిరణ్‌ను బర్తరఫ్ చేయాలి
పాపన్నపేట: కుట్రలు, కుతంత్రాలతో, నాటకాలు, బహురూపులతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మె ల్యే పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశా రు. బుధవారం మండల పరిధిలోని మల్లంపేట, పాపన్నపేట గ్రామాల్లో జరిగిన బోనాల పండగ ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.
ముసాయిదా బిల్లుకు, ఒరిజనల్ బిల్లుకు తేడా తెలియని కిరణ్ స్పీకర్‌గా, ప్రభుత్వ విప్‌గా, ఎమ్మెల్యేగా పనిచేయడం దురదృష్టకరమన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులిద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. వందమంది కిరణ్‌లు, చంద్రబాబులు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని తెలిపారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని, అక్కడ అన్ని పార్టీల అధినేతలు కలిసి తెలంగాణకు మద్దతు కూడగడతారని తెలిపారు.
ట్రాన్స్‌కో కార్యాలయం ముట్టడి
Published Thu, Jan 30 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM
Advertisement
Advertisement