
తెలంగాణకు ద్రోహం చేస్తున్న చంద్రబాబు
ఖలీల్‌వాడి : ‘విభజన’ తరువాత కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ద్రోహం చేస్తునే ఉన్నాడని తెలంగాణ సీపీఐ రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శిం చారు. బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాష్ట్రంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణకు 53.89 శాతం,సీమాంధ్రకు 46.11 శాతంగా వాటా నిర్ణయం జరిగిందన్నారు.
వివాదాలకు ఆస్కారం లేకుండా విద్యుత్ విభజన చేశారని తెలిపారు. భౌగోళికంగా ఎక్క డి విద్యుత్ ప్రాజెక్టు ఆ రాష్ట్రానికి చెందడంతో పాటు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల ప్రకారం విద్యుత్తు లభ్యత ఇరు రాష్ట్రాలకు ఉంటుందన్నారు. విభజన చట్టం 2014 ప్రకారం విద్యుత్తు వినియోగాన్ని బట్టి విద్యుత్ విభజన జరగడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడని అన్నారు. మిగతా విషయాలన్నీ జనాభా ఆధారంగా విభజించినప్పుడు విద్యుత్తు విభజన సైతం జనాభా ఆధారంగానే ఉండాలని ఏపీ సర్కార్ వాదిస్తోందన్నారు. కాని అలా జరిగితే మాత్రం తెలంగాణ ప్రాంతం మొత్తం విద్యుత్ కోతతో విలవిలలాడుతుందన్నారు.
చంద్రబాబు వల్ల ఇప్పటికే తెలంగాణకు తీవ్ర అన్యాం జరిగిందని ఇక సహించేది లేదన్నారు. విద్యు త్తు ఉత్పత్తి విషయంలోనే మొదటి సారిగా ఏర్పాటు అయిన రాష్ట్రాల మధ్య ఇచ్చి పుచ్చుకునే తత్వం లేక పోతే రా నున్న రోజుల్లో ఈ తగాదాలు మరింత పెరగడానికి ఆస్కారం ఉందన్నారు. రాష్ట్రాలు బాగు పడకపోతే తెలంగాణ ప్రజల తరపున పార్టీ మరో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మొదట రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే రైతులకు కొత్త రుణాలను అందించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ను త్వరలో కలిసి దాని డిజైన్ మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు.రానున్న రోజుల్లో తెలంగాణలో సీపీఐను మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేసే విధంగా ఇకపై ముందుకు సాగుతామన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు పల్లె వెంకట్ రెడ్డి,జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, నాయకులు సుధాకర్ పాల్గొన్నారు.