సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో అరెస్టులు ప్రారంభమయ్యాయి. హైకోర్టు సహోద్యోగుల నుంచి రూ. 6.5 కోట్లను వసూలు చేశారనే ఆరోపణలపై సొసైటీ మాజీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్‌ను సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. హైకోర్టు ఉద్యోగుల సొసైటీ సభ్యుల ఇళ్ల నిర్మాణం కోసం గచ్చిబౌలిలో ప్రభుత్వం 35 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ భూముల అభివృద్ధి పేరుతో సొసైటీ పాలకవర్గం అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ హరిణి రూ. 4.5 కోట్లు దుర్వినియోగమైనట్లు తేల్చారు. తన నివేదికలో 25 మందిని నిందితులుగా పేర్కొన్నారు.