
వృద్ధ దంపతుల వేషధారణలో అంధుడు కర్రి వెంకటరెడ్డి, గోపికృష్ణారెడ్డి
అనపర్తి (తూర్పుగోదావరి): అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో రెండేళ్లకోసారి నిర్వహించే సత్తెమ్మ తల్లి జాతర వైభవంగా నిర్వహించారు. సావరానికి చెందిన కర్రి వెంకటరెడ్డి పుట్టుకతో అంధుడు. నిరాశ చీకట్లు అలముకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలల పంట సచివాలయంలో ఇతనికి వెల్ఫేర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం లభించింది.
ఈ నేపథ్యంలో సోమవారం వృద్ధుని వేషం వేసుకుని అమ్మవారికి మొక్కు తీర్చుకున్నాడు. సీఎం జగన్ చల్లగా ఉండాలని కోరుకుంటూ స్నేహితుడు తాడి గోపికృష్ణారెడ్డి(మహిళ వేషధారి)తో కలసి అమ్మవారికి “ముసలోడికి దసరా పండుగ’ వేషధారణలో మొక్కు తీర్చుకున్నాడు వెంకటరెడ్డి.
బీ టెక్.. డిఫరెంట్ లుక్ : అఖండ వేషధారణలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఎన్.వీర్రాఘవరెడ్డి
అదుర్స్ : పండితుల వేషధారణలో గ్రామస్తులు
తగ్గేదే లే : పుష్ప సినిమాలోని వేషధారణలో యువకులు
చదవండి: (మిమ్మల్ని విడిచి యాడకీ పోను..!)