బీజేపీ కుట్రలను ఎదుర్కొనేందుకు సభలు: చాడ
సాక్షి, హైదరాబాద్: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ఈ నెల 22న లేదా 24న హైదరాబాద్‌కు రానున్నారు. రోహిత్ వేముల తల్లిని పరామర్శించిన అనంతరం నగరంలో నిర్వహించే బహిరంగ సభ, హెచ్‌సీయూలో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను బలహీనపరిచేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలకు దిగుతోందని విమర్శించారు.
ఈ కుట్రలను ఎదుర్కొనేందుకు సమావేశాలను నిర్వహిస్తున్నట్లు, దీనిలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభలో కన్హయ్య పాల్గొంటారని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలను పార్టీ నాయకులు పల్లా వెంకటరెడ్డి, జి.మల్లేష్‌లతో కలసి ఆయన విలేకరులకు తెలిపారు. రాష్ర్టంలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా మరో వెయ్యి గ్రామాలకు పార్టీని విస్తరించనున్నట్లు తెలియజేశారు.
వచ్చే వారంలో హైదరాబాద్‌కు కన్హయ్య
Published Sat, Mar 19 2016 4:56 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
Advertisement
Advertisement