వరుస కరువు కాటకాలతో రతనాల సీమ రాళ్ల సీమగా మారిపోయింది. వలసలతో ఊళ్లు ఖాళీ అవుతుండగా.. బక్కచిక్కిన రైతన్నలు కూలీలుగా మారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రగిల్చిన విభజన చిచ్చు జిల్లావాసుల నోట్లో మట్టి కొట్టనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల కుమ్మక్కు రాజకీయాలకు తెలుగు ప్రజలు రెండుగా చీలిపోయారు. ఇప్పుటికే కర్ణాటక నుంచి వాటా నీటి కోసం సిగపట్లు తప్పడం లేదు.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో నీటి ఇక్కట్లు ఏ స్థాయిలో ఉంటాయోననే బెంగ ప్రజలకు కంటి మీద కునుకును దూరం చేస్తోంది.
ఈ విషయంలో మొదటి నుంచి పోరాటం చేస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రెండు పార్టీలు మద్దతివ్వకపోవడంతో ఏదైతే జరగకూడదనుకుని అందరూ భావించారో అది జరిగిపోయింది. నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి కోరారు.
నేడు బంద్
Published Wed, Feb 19 2014 3:16 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement