
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షన్‌దారుల సెల్ రాష్ట్ర కన్వీనర్‌గా పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నియామక పత్రాన్ని అందజేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పేరి వెంకట్‌రెడ్డి పీఆర్టీయూ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా 15 ఏళ్లు, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా 9 ఏళ్లు పనిచేశారు. పదవీ విరమణ అనంతరం ఇటీవల బీజేపీలో చేరారు. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగులు, పెన్షన్‌దారుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment