అందమైన లోగిళ్లు | AV info pride in Uppal Bus Depot | Sakshi
Sakshi News home page

అందమైన లోగిళ్లు

Published Sat, Nov 29 2014 12:24 AM | Last Updated on Sat, Aug 25 2018 4:06 PM

అందమైన లోగిళ్లు - Sakshi

అందమైన లోగిళ్లు

ఉప్పల్ బస్ డిపో ప్రాంతంలో ఏవీ ఇన్ఫో ప్రైడ్
 
సాక్షి, హైదరాబాద్: ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మన్నికైన ఇంటిని అందుబాటు ధరల్లో అందజేసే ప్రాజెక్ట్‌లను ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆదరిస్తారంటున్నారు ఏవీ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ వెంకట్‌రెడ్డి. అందుకే మెట్రో రైల్ ప్రాజెక్ట్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటైన వరంగల్ హైవేలో ‘ఏవీ ఇన్ఫో ప్రైడ్’ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం.

అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఆధునిక వసతులతో కూడిన ఫ్లాట్లను అందుబాటు ధరల్లో అందించడమే లక్ష్యంగా ఉప్పల్ బస్‌డిపో ప్రాంతంలో రెండున్నర ఎకరాల్లో ‘ఇన్ఫో ప్రైడ్’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 210 ఫ్లాట్లు. 1,100-1,800 చ.అ.ల్లో 2, 3 పడక గదుల ఫ్లాట్లొస్తాయి. చ.అ. రూ.2,550.

పాజెక్ట్ నిర్మాణంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్రమాణాలన్నీ పాటిస్తున్నాం. నగరంలో ఉంటూ కూడా పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వీలుగా 60 శాతం స్థలాన్ని పచ్చదనానికే కేటాయిస్తున్నాం. 18 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్, జిమ్, స్విమ్మింగ్ పూల్, బాంక్విట్ హాల్‌లతో పాటు విశాలమైన పార్కింగ్, ఇండోర్ గేమ్స్, బేబీ డేకేర్ సెంటర్ వంటి వసతులెన్నో కల్పిస్తున్నాం. 2015 డిసెంబర్ కల్లా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి కొనుగోలుదారులకందిస్తాం.

ఈ ప్రాజెక్ట్ సింగపూర్ టౌన్‌షిప్‌కు 6 కి.మీ. దూరంలో, ఉప్పల్ మెట్రోకు 4 కి.మీ. దూరంలో, వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న నందనవనం పార్క్‌కు అర కి.మీ. దూరంలోనే ఉండటంతో ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన కొద్ది రోజు ల్లోనే  76 ఫ్లాట్లు విక్రయించగలిగాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement