uppal bus stop
-
అందమైన లోగిళ్లు
ఉప్పల్ బస్ డిపో ప్రాంతంలో ఏవీ ఇన్ఫో ప్రైడ్ సాక్షి, హైదరాబాద్: ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మన్నికైన ఇంటిని అందుబాటు ధరల్లో అందజేసే ప్రాజెక్ట్‌లను ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆదరిస్తారంటున్నారు ఏవీ కన్స్ట్రక్షన్స్ ఎండీ వెంకట్‌రెడ్డి. అందుకే మెట్రో రైల్ ప్రాజెక్ట్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటైన వరంగల్ హైవేలో ‘ఏవీ ఇన్ఫో ప్రైడ్’ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఆధునిక వసతులతో కూడిన ఫ్లాట్లను అందుబాటు ధరల్లో అందించడమే లక్ష్యంగా ఉప్పల్ బస్‌డిపో ప్రాంతంలో రెండున్నర ఎకరాల్లో ‘ఇన్ఫో ప్రైడ్’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 210 ఫ్లాట్లు. 1,100-1,800 చ.అ.ల్లో 2, 3 పడక గదుల ఫ్లాట్లొస్తాయి. చ.అ. రూ.2,550. పాజెక్ట్ నిర్మాణంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్రమాణాలన్నీ పాటిస్తున్నాం. నగరంలో ఉంటూ కూడా పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వీలుగా 60 శాతం స్థలాన్ని పచ్చదనానికే కేటాయిస్తున్నాం. 18 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్, జిమ్, స్విమ్మింగ్ పూల్, బాంక్విట్ హాల్‌లతో పాటు విశాలమైన పార్కింగ్, ఇండోర్ గేమ్స్, బేబీ డేకేర్ సెంటర్ వంటి వసతులెన్నో కల్పిస్తున్నాం. 2015 డిసెంబర్ కల్లా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి కొనుగోలుదారులకందిస్తాం. ఈ ప్రాజెక్ట్ సింగపూర్ టౌన్‌షిప్‌కు 6 కి.మీ. దూరంలో, ఉప్పల్ మెట్రోకు 4 కి.మీ. దూరంలో, వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న నందనవనం పార్క్‌కు అర కి.మీ. దూరంలోనే ఉండటంతో ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన కొద్ది రోజు ల్లోనే 76 ఫ్లాట్లు విక్రయించగలిగాం. -
హైదరాబాద్ లో భారీ వర్షం
-
హైదరాబాద్ లో భారీ వర్షం
* స్తంభించిన ట్రాఫిక్.. నాలాలో పడి మహిళ మృతి సాక్షి, హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్ కిలోమీటర్ల మేర స్తంభిం చింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి చేరిన నీటిని తొలగించేందుకు స్థానికులు నానా అవస్థలు పడ్డారు. రాత్రి 8.30 గంటల వరకు 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. నాలాలో పడి మహిళ దుర్మరణం... సికింద్రాబాద్ రెతి ఫైల్ బస్‌స్టేషన్ సమీపంలోని ఉప్పల్ బస్టాండ్ వద్దనున్న నాలాలో పడి బుధవారం రాత్రి ఓ మహిళ దుర్మరణం చెందింది. శామీర్‌పేట మండలం అలియాబాద్‌కు చెందిన సత్యవాణి(25) కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్‌లోని బంధువుల ఇంటికి వె ళ్లి వస్తుండగా భారీ వర్షం కురిసింది. ఉప్పల్ బస్‌స్టాప్ వైపు వెళుతుండగా నీటి ఉద్ధృతికి నాలాలో చిక్కుకుపోయింది. స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. మృతురాలి భర్త సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. -
నాలాలో కొట్టుకుపోయిన మహిళ
శామీర్‌పేట్ : బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న క్రమంలో శామీర్‌పేట మండలంలోని అలియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఉప్పల్ బస్టాండ్ వద్ద గల నాలాలో పడి కొట్టుకుపోయింది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా ఈపూర్ మండల కేంద్రానికి చెందిన భాగ్యరావు అలియాస్ భాస్కర్, లక్ష్మిలు దంపతులు. వీరు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువుకోసం అలియాబాద్ గ్రామానికి వచ్చి ఉంటున్నారు. భాస్కర్ మేస్త్రీ పని చేస్తుంటాడు. వీరికి కూతురు సత్యవాణి(25)కు ఏడేళ్ల క్రితం నాగార్జునసాగర్‌కు చెందిన ప్రేమ్‌రాజ్‌తో వివాహమైంది. ప్రేమ్‌రాజ్ స్థానికంగా ఉన్న సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం సత్యవాణి తన కుటుంబీకులతో కలిసి సికింద్రాబాద్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి రాత్రి అలియాబాద్‌కు వచ్చే క్రమంలో ఉప్పల్ బస్టాండ్ వద్దకు రాగానే అప్పటికే కురుస్తున్న భారీ వర్షం కారణంగా వచ్చిన నీటి ఉధృతికి బస్టాండ్ వద్ద నాలాలో చిక్కుకుపోయింది. స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళను సత్యవాణిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళ
-
నాలాలో కొట్టుకుపోయి మహిళ మృతి
సికింద్రాబాద్: జంట నగరాల్లో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ మహిళ బలైంది. ఉప్పల్ బస్టాండ్ వద్ద నాలాలో కొట్టుకుపోయి సత్యవేణి(26) అనే మహిళ మృతి చెందింది. మృతురాలు శామీర్‌పేట నివాసిగా గుర్తించారు. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు చెరువులను తలపించాయి. పంజాగుట్ట, అమీర్‌పేట మైత్రివనం, బేగంపేట, సోమాజిగూడ, కుకట్పల్లి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సింగడం బస్తీలో ఇళ్లలోకి నీరు చేరింది. పలు ఇళ్ల గోడలు కూలిపోయాయి. వాహనాలు ధ్వంసమైయ్యాయి.