సికింద్రాబాద్ ఉప్పల్ బస్టాండ్ వద్ద నాలాలో ఓ మహిళ కొట్టుకుపోయింది.
సికింద్రాబాద్: జంట నగరాల్లో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ మహిళ బలైంది. ఉప్పల్ బస్టాండ్ వద్ద నాలాలో కొట్టుకుపోయి సత్యవేణి(26) అనే మహిళ మృతి చెందింది. మృతురాలు శామీర్పేట నివాసిగా గుర్తించారు. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు చెరువులను తలపించాయి. పంజాగుట్ట, అమీర్పేట మైత్రివనం, బేగంపేట, సోమాజిగూడ, కుకట్పల్లి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సింగడం బస్తీలో ఇళ్లలోకి నీరు చేరింది. పలు ఇళ్ల గోడలు కూలిపోయాయి. వాహనాలు ధ్వంసమైయ్యాయి.