సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, ఉప్పల్, రామంతాపూర్, మేడిపల్లి, అంబర్‌పేట్, నల్లకుంట, నాచారం, ఓయూ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రోడ్లపై వర్షపు నీరు పరుగులు పెడుతోంది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
సికింద్రాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. కంటోన్మెంట్, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రేజిమెంటల్ బజార్, చిలకలగూడ, బేగంపేట తదితర ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరుకుంటుంది. లోతట్టు ప్రాంతాలో వరద నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
చదవండి: బస్టాండ్‌లో విషాదం: బస్సుల మధ్య ఇరుక్కుపోయి..
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇంట్లో విషాదం
Comments
Please login to add a commentAdd a comment