ప్రొద్దుటూరు కల్చరల్, న్యూస్‌లైన్: స్థానిక రాయలసీమ వ్యాయామ కళాశాలలో 59వ రాష్ట్ర స్థాయి అండర్-19 అథ్లెటిక్ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 22 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే లింగారెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రఖ్యాతులు గడించాలన్నారు. ఆర్సీపీఈ ప్రిన్సిపాల్ గోపాల్‌రెడ్డి, ఆర్‌ఐపీఈ భానుమూర్తి రాజులు మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతాయన్నారు. ముందుగా క్రీడా జెండాను ఎగురవేసి క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
కార్యక్రమంలో జిల్లా జూనియర్ కళాశాలల వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి వెంకటరెడ్డి, వ్యాయామ సంచాలకులు ఓబులరెడ్డి, జోనల్ స్థాయి పాఠశాలల కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, బాషా అథ్లెటిక్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహబూబ్‌బాషా, ఆర్సీపీఈ విద్యార్థులు, అధ్యాపకులు ఈ పోటీలను పర్యవేక్షించారు. తొలి రోజు పరుగు పోటీలో 400 మీటర్లలో బాలుర విభాగంలో రమేష్ (ఖమ్మం), గోపాలకృష్ణ (ఖమ్మం), శ్రవణ్(వరంగల్), బాలికల విభాగంలో జ్యోతి (రంగారెడ్డి), భాగ్యలక్ష్మి (హైదరాబాద్), సుమాంజలి(ప్రకాశం), 300 మీటర్ల బాలుర పరుగు పోటీలో బి.తిరుపతి (వరంగల్), శ్రీనివాస్ (రంగారెడ్డి), నవీన్‌రెడ్డి(గుంటూరు), బాలికల విభాగంలో సుష్మిత (ఖమ్మం), వెంకటలక్ష్మి (వెస్ట్ గోదావరి), స్వాతి (వైఎస్‌ఆర్)లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. , 4ఁ100 బాలికల విభాగంలో హైదరాబాద్ ప్రథమ, ఖమ్మం ద్వితీయ, వెస్ట్ గోదావరి తృతీయస్థానం నిలిచింది.
అట్టహాసంగా రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు
Published Wed, Dec 25 2013 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement