షకలక శంకర్, రాజీవ్ కనకాల
రాజీవ్ కనకాల, ‘షకలక’ శంకర్, అక్షా ఖాన్ ప్రధాన పాత్రల్లో కాచిడి గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘దళారి’. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాతలు సి. కల్యాణ్, దామోదర ప్రసాద్ విడుదల చేశారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘వెంకట్ రెడ్డిగారిలాంటి కొత్తవారు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది.
‘దళారి’ ట్రైలర్ బాగుంది.. సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆకృతి క్రియేషన్స్ పతాకంపై రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు వెంకట్ రెడ్డి. ‘‘సమాజంలో ఏ పని జరగాలన్నా ఒక దళారి ఉంటాడు. అలాంటి దళారి పాత్ర రాజకీయంలో ఉంటే ఎలా ఉంటుందో తెలిపేదే మా సినిమా’’ అన్నారు గోపాల్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment