government junnior college
-
క్రీడా స్ఫూర్తిని అలవరచుకోవాలి
ప్రొద్దుటూరు కల్చరల్, న్యూస్‌లైన్: క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని ఆర్‌ఐపీఈ భానుమూర్తి రాజు అన్నారు. స్థానిక రాయలసీమ వ్యాయామ కళాశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన 59వ రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్-19 అథ్లెటిక్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో గెలుపోటములు సహజమేనని, ఓటమికి కుంగిపోకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లి విజయం సాధించాలన్నారు. నిత్యం క్రీడా సాధన చేస్తూ నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. రాయలసీమ వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయన్నారు. రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి క్రీడా పోటీలలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉందన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడా కారులను తీర్చిదిద్ది ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేయాలన్నారు. ఈ పోటీలలో 22 జిల్లాలకు చెందిన 400 మందికిపైగా క్రీడాకారుల మధ్య 100, 400, 800 మీటర్లు, షాట్‌పుట్, జావిలిన్త్రో, లాంగ్‌జంప్, హైజంప్ తదితర విభాగాలలో పోటీలు నిర్వహించారు. ఆద్యంతం ఈ పోటీలు ఆసక్తికరంగా జరిగాయి. ఈ పోటీలలో ఓవరాల్ చాంపియన్ షిప్‌ను ఖమ్మం జిల్లా సాధించింది. బాలుర విభాగంలో వ్యక్తిగత విభాగంలో చాంపియన్ షిప్‌ను కృష్ణా జిల్లాకు చెందిన యశ్వంత్ కుమార్, బాలికల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన విశాలాక్షి సాధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జూనియర్ కళాశాలల వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి వెంకటరెడ్డి, వ్యాయామ సంచాలకులు ఓబుళరెడ్డి, జోనల్ స్థాయి పాఠశాలల కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రటరీ సుబ్బరాజు, బాషా అథ్లెటిక్ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్‌బాషా, రాయలసీమ వ్యాయామ కళాశాల అధ్యాపకులు, వ్యాయామ అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్, న్యూస్‌లైన్: స్థానిక రాయలసీమ వ్యాయామ కళాశాలలో 59వ రాష్ట్ర స్థాయి అండర్-19 అథ్లెటిక్ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 22 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే లింగారెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రఖ్యాతులు గడించాలన్నారు. ఆర్సీపీఈ ప్రిన్సిపాల్ గోపాల్‌రెడ్డి, ఆర్‌ఐపీఈ భానుమూర్తి రాజులు మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతాయన్నారు. ముందుగా క్రీడా జెండాను ఎగురవేసి క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా జూనియర్ కళాశాలల వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి వెంకటరెడ్డి, వ్యాయామ సంచాలకులు ఓబులరెడ్డి, జోనల్ స్థాయి పాఠశాలల కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, బాషా అథ్లెటిక్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహబూబ్‌బాషా, ఆర్సీపీఈ విద్యార్థులు, అధ్యాపకులు ఈ పోటీలను పర్యవేక్షించారు. తొలి రోజు పరుగు పోటీలో 400 మీటర్లలో బాలుర విభాగంలో రమేష్ (ఖమ్మం), గోపాలకృష్ణ (ఖమ్మం), శ్రవణ్(వరంగల్), బాలికల విభాగంలో జ్యోతి (రంగారెడ్డి), భాగ్యలక్ష్మి (హైదరాబాద్), సుమాంజలి(ప్రకాశం), 300 మీటర్ల బాలుర పరుగు పోటీలో బి.తిరుపతి (వరంగల్), శ్రీనివాస్ (రంగారెడ్డి), నవీన్‌రెడ్డి(గుంటూరు), బాలికల విభాగంలో సుష్మిత (ఖమ్మం), వెంకటలక్ష్మి (వెస్ట్ గోదావరి), స్వాతి (వైఎస్ఆర్)లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. , 4ఁ100 బాలికల విభాగంలో హైదరాబాద్ ప్రథమ, ఖమ్మం ద్వితీయ, వెస్ట్ గోదావరి తృతీయస్థానం నిలిచింది. -
సమైక్యమే లక్ష్యం
సాక్షి, అనంతపురం : ‘ఒకటే గమనం...ఒకే లక్ష్యం’ అంటూ సమైక్య సమరవీరులు కదం తొక్కుతున్నారు. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా విభజనాగ్రహంతో రగిలిపోతున్నారు. విచ్ఛిన్నకర శక్తుల పీచమణచడానికి కలసికట్టుగా ముందుకు సాగుతున్నారు. తెలుగు జాతిని విడదీస్తే ఊరుకునేది లేదంటూ సింహ‘గర్జన’ చేస్తున్నారు. ‘సమైక్య’ రాష్ట్రం తప్ప మరో ఆప్షన్ లేనేలేదంటూ ముక్తకంఠంతో చాటిచెబుతున్నారు. ఫలితంగా 63వ రోజైన మంగళవారం జిల్లాలో సమైక్య ఉద్యమం పెను తుపానులా విరుచుకుపడింది. రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సమైక్య ‘రణభేరి’ సభకుజిల్లా నలుమూలల నుంచి ఉద్యమకారులు తరలివచ్చారు. ఐకేపీ మహిళలు, గ్రామీణులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేలాదిగా తరలి రావడంతో జూనియర్ కళాశాల మైదానం జనసంద్రమైంది. ‘జై..సమైక్యాంధ్ర’ నినాదాలతో పట్టణం దద్దరిల్లిపోయింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన గజల్ శ్రీనివాస్ ఆలపించిన గేయాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. విశాలాంధ్ర మహాసభ నాయకుడు శ్రీనివాసరెడ్డి ప్రసంగం అందర్నీ ఆలోచింపజేసింది. గుంతకల్లులో ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే కొట్రికె మధుసూదనగుప్తాలకు సమైక్య సెగ తగిలింది. మునిసిపల్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టిన జేఏసీ నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వారు వెళ్లగా... ‘గోబ్యాక్’ అంటూ పెద్దఎత్తున నినదించారు. జేఏసీ నాయకులు చుట్టుముట్టి.. రాజీనామాలకు డిమాండ్ చేశారు. ‘రాజీనామాలు చేసిన తరువాతే ఉద్యమంలో పాల్గొనండి. లేకపోతే బయట అడుగుపెట్టకండి’ అంటూ సూచించారు. దీంతో చేసేది లేక ఎంపీ, ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతపురం నగరంలో నాయీ బ్రాహ్మణులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి బ్యాండ్‌మేళాలతో ర్యాలీ నిర్వహించారు. జాక్టో ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. సర్వజనాస్పత్రి ఎదుట వైద్య, ఆరోగ్య సిబ్బంది రిలే దీక్షలకు గజల్ శ్రీనివాస్ సంఘీభావం ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి.. సప్తగిరి సర్కిల్లో మానవహారం నిర్మించారు. రెవెన్యూ ఉద్యోగులు స్థానిక టవర్‌క్లాక్ సర్కిల్లో టీస్టాల్ ఏర్పాటు చేసి.. నిరసన తెలిపారు. బెస్త కులస్థులు ర్యాలీ చేశారు. రాష్ట్రం విడిపోతే మిరపకాయలు తిని బతకాల్సిందేనంటూ ఆర్ట్స్ కళాశాల బోధనా సిబ్బంది మెడలో మిరపకాయల దండలు వేసుకుని రిక్షా తొక్కుతూ నిరసన తెలిపారు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ.. వైఎస్సార్సీపీ డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్కేయూలో జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. 205 జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. ధర్మవరంలో సమైక్యవాదులు ర్యాలీ, మానవహారం చేపట్టారు. సకల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కే సీఆర్ మాస్కుధారుడికి సెలైన్గా విస్కీ ఎక్కించి నిరసన తెలిపారు. ముదిగుబ్బలో మహిళలు, విద్యార్థులు జాతీయజెండాలను చేతబట్టి ర్యాలీ చేశారు. తాడిమర్రిలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో, గుంతకల్లులో నాయీబ్రాహ్మణులు ర్యాలీలు నిర్వహించారు. పామిడిలో నాయీ బ్రాహ్మణులు రోడ్డుపైనే షేవింగ్ చేస్తూ.. వంటా వార్పు చేపట్టి నిరసన తెలిపారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు చెవిలో పూలు పెట్టుకుని ర్యాలీ చేశారు. పట్టణంలోని సద్భావన సర్కిల్లో ఉపాధ్యాయులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఏపీఎన్జీఓలు భిక్షాటన చేశారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. కదిరిలో జేఏసీ నాయకులు రోడ్డుపైనే రైతు బజార్ ఏర్పాటు చేశారు. కళ్యాణదుర్గంలోని టీ సర్కిల్లో మానవహారం నిర్మించి.. మోకాళ్లపై నిలబడి సమైక్య నినాదాలు చేశారు. మడకశిరలో సమైక్యవాదులు ముఖానికి ప్లాస్టిక్ కవర్లు వేసుకుని.. అర్ధనగ్నంగా రోడ్డుపై బైఠాయించారు. అమరాపురం, గోరంట్లలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తిలో ట్రాన్స్‌కో ఉద్యోగులు సబ్స్టేషన్పెకైక్కి నిరసన తెలిపారు. ఓడీచెరువులో జేఏసీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి.. దహనం చేశారు. పెనుకొండలో హౌసింగ్ ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. జేఏసీ నాయకుల ర్యాలీలో తాగుతూ తూలుతున్నట్లు నడిచిన కేసీఆర్ మాస్కుధారుడు అందర్నీ ఆకట్టుకున్నాడు. రాప్తాడులో ఉపాధ్యాయులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గేదెలకు కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలను తగిలించి నిరసన తెలిపారు. కనగానపల్లిలో నాయీ బ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించి... కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నార్పలలో సమైక్యవాదులు భిక్షాటన చేశారు. తాడిపత్రిలో జేఏసీ నాయకులు ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించారు. ఏడీసీసీ బ్యాంకు సిబ్బంది ర్యాలీ, వంటావార్పు చేపట్టారు. యాడికిలో రక్తదాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఉరవకొండలో జేఏసీ ఆధ్వర్యంలో తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. -
జనహోరు
సాక్షి, కడప/రాయచోటి: రాష్ట్రవిభజన నిరసిస్తూ, సమైక్యరాష్ట్ర సాధన కోసం సాగుతున్న పోరుకు ‘రాయచోటిరణభేరి’ విజయంతో రెట్టించిన ఉత్సాహం వచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా గురువారం రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ‘రణభేరి’ పేరుతో సభను నిర్వహించారు. ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి ఆర్డీవో వీరబ్రహ్మం అధ్యక్షత వహించారు. వేలాదిమంది ప్రజలు తరలివచ్చారు. ఉదయం 11.05 గంటలకు మొదలైన సభలో మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేశారు. అశోక్‌బాబు ఢంకా మోగించి సమైక్యవాణి ఢిల్లీకి వినపడేలా రణభేరిని మొదలెట్టారు. 58రోజులుగా శాంతియుతంగా సమైక్య ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించనందుకు నిరసనగా నల్లపావురాలు ఎగరేశారు. సభ మొదలవగానే వైఎస్సార్కాంగ్రెస్పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగపండు ఉష, బృందం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ‘వామ్మో..ఓ సోనియమ్మా..మా ఇండియాలో ఇటలీ బొమ్మ, ఏం పిల్లడో ఎల్దమొస్తవా!’ అంటూ ఆటపాటలతో అలరించారు. మండుటెండను లెక్కచేయక. గురువారం రాయచోటిలో విపరీతమైన ఎండకాసింది. అయినా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ విద్యార్థులు, మహిళలు, వృద్ధులు సభాప్రాంగణంలోనే కూర్చుండిపోయారు. సమైక్యనేతల మాటలను నిశితంగా ఆలకించారు. రాయలసీమకు వాటిల్లే కష్టం, అందులోనూ వైఎస్సార్‌జిల్లాకు కలిగే నష్టం, సీమ కరువు పరిస్థితులు, సమైక్యరాష్ట్రం ఆవశ్యకతపై అశోక్‌బాబు చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. అలాగే సాగునీటి వనరులు, విడిపోతే తలెత్తే ఇబ్బందులు, ఆర్టీసీ మనుగడపై ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ చంద్రశేఖరరెడ్డి వివరణాత్మకంగా ప్రసంగించారు. ఉద్యోగసంఘాల రాష్ట్ర, జిల్లా నేతలు, సమైక్యాంధ్ర ఉద్యమం, ఆవశ్యకతలను వివరించారు. సభలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులు సమైక్యవాదంపై పాటపాడి అభినయించారు. సమైక్యవాదానికి కొత్త ఊపిరి: రాయచోటి రణభేరి ఊహించినదానికంటే విజయం సాధించడంతో జిల్లాలో జరుగుతున్న సమైక్య ఉద్యమానికి కొత్త ఊపిరి, సమైక్యవాదుల్లో రెట్టించిన ఉత్సాహం వచ్చింది.58 రోజులుగా సాగుతున్న ఉద్యమం సమైక్య ప్రకటన వచ్చేవరకూ ఆగే ప్రసక్తే లేదని అశోక్‌బాబు ఉద్ఘాటించారు. జీతాలు రాకపోయినా బెదరమని, సమైక్య ఉద్యమం గురించి అవాకులు, చెవాకులు పేలితే నాలుకలు చీల్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజలదని సమైక్య పరిరక్షణవేదిక అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి అన్నారు. రణభేరి విజయవంతం అయ్యేందుకు రాయచోటి జేఏసీ కన్వీనర్ నాగిరెడ్డి వారంరోజులుగా శ్రమించారు. సభలో జేఏసీ కోకన్వీనర్ డీఆర్వో ఈశ్వరయ్య, జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి, సమైక్య ఉద్యమ నాయకులు గంగిరెడ్డి, రవికుమార్, శివకుమార్, శివారెడ్డి రాష్ట్ర వీఆర్వోల సంఘం అధ్యక్షుడు భత్సవత్సం నాయుడు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వినాయకం, గెజిటెడ్ అధికారులు సంఘం అధ్యక్షుడు రామ్మూర్తినాయుడు పాల్గొన్నారు. -
రక్కసి కుక్కలు
సుల్తానాబాద్, న్యూస్‌లైన్ : సుల్తానాబాద్‌లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశారుు. అశోక్‌నగర్, మార్కండేయ కాలనీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఒక్కసారిగా దాడి చేయడంతో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిలో కె.మల్లేశం, జి.మల్లేశం, గజభీంకార్ జగన్, సి.అనిల్, ఎ.అమృతమ్మ, కె.సిరిమల్లి, పస్తెం అపర్ణ, సముద్రాల రమేశ్, కె. శ్రీనివాస్ ఉన్నారు. కుటుంబ సభ్యులు గమనించి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్ శ్రీనివాస్ ప్రాథమిక వైద్యం చేసి కరీంనగర్ ఆస్పత్రికి సిఫారసు చేశారు. రోగులను 108 వాహనంలో తరలించారు. సమాచారం అందుకున్న సర్పంచ్ అంతటి అన్నయ్య ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులకు సహాయ చర్యలు చేపట్టడంతోపాటు జిల్లా వైద్యాధికారి బాలుతో ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ముగ్గురి పరిస్థితి విషమం మార్కండేయ కాలనీలోని పస్తెం చంద్రయ్య-రజిత కూతురు అపర్ణ(5నెలలు)ను ఇంటి ముందు మంచంలో పడుకోబెట్టి తల్లి పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో పిచ్చికుక్క దాడి చేసింది. చిన్నారి ముఖంపై తీవ్రగాయూలయ్యూరుు. ఆమెతోపాటు జి.మల్లేశం, గజభీంకార్ జగన్‌ను సైతం తీవ్రంగా గాయపర్చడంతో వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్, హైదరాబాద్‌కు తరలించారు. -
ఓవరాల్ చాంప్ కేఎంజేసీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ జూనియర్ కాలేజి ఫెన్సింగ్ టోర్నమెంట్లో ఓవరాల్ బాలుర టీమ్ టైటిల్‌ను కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి (కేఎంజేసీ) చేజిక్కించుకుంది. బాలికల టీమ్ టైటిల్‌ను సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి జట్టు కైవసం చేసుకుంది. హైదరాబాద్ జిల్లా జూనియర్ కాలేజి గేమ్స్ సమాఖ్య (హెచ్‌డీఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఓల్డ్ మలక్‌పేట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజిలో మంగళవారం ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో కేఎంజేసీ క్రీడాకారులు ఒక స్వర్ణం, ఒక రజతం, ఐదు కాంస్యాలను గెలుచుకున్నారు. కార్యక్రమానికి హాజరైన గవర్నమెంట్ జూనియర్ కాలేజి ప్రిన్సిపల్ స్వరూప వాణి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌డీఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఎల్.రాజేంద్ర ప్రసాద్, రామారావు, పీడీ రమణ తదితరులు పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు బాలుర విభాగం: సాబ్రే ఈవెంట్ :1. కె.సనీత్ (శ్రీచైతన్య జూనియర్ కాలేజి), 2. పి.రవి (జీజేసీ ఓల్డ్ మలక్‌పేట్), 3. వి.సాయినాధ్ (కేఎంజేసీ), ఎ.మహేష్ (జీజేసీ కూకట్పల్లి). ఈపీ ఈవెంట్: 1. ఎల్.శ్రీకర్ ప్రసాద్ (నారాయణ జూనియర్ కాలేజి), 2. కె.సాయి కృష్ణ (నారాయణ జూనియర్ కాలేజి), 3. రమేష్ నాయక్ (కేఎంజేసీ), ఎన్.రోహిత్ (కేఎంజేసీ). ఫాయిల్ ఈవెంట్: 1. సాయితరుణ్ (కేఎంజేసీ), 2. పి.టి.నారాయణ (కేఎంజేసీ), 3. ప్రభాకర్ (కేఎంజేసీ), రాందాస్ (కేఎంజేసీ). బాలికల విభాగం: సాబ్రే ఈవెంట్: కావ్యశ్రీ (సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి), 2. ఎస్.రచన (సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి), 3. అయేషా (విజయనగర్ జూనియర్ కాలేజి), జి.సాహిత్య (శ్రీగాయత్రీ జూనియర్ కాలేజి). ఈపీ ఈవెంట్: 1.మాన్విత (శ్రీగాయత్రీ జూనియర్ కాలేజి), 2. కావ్యశ్రీ (సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి), 3. పి.భావన (శ్రీచైతన్య జూనియర్ కాలేజి), ఎస్.రవళిక (సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి). ఫాయిల్ ఈవెంట్: 1. మాన్విత (శ్రీగాయత్రీ జూనియర్ కాలేజి), 2.పి. భావన (శ్రీచైతన్య జూనియర్ కాలేజి), 3. షమీల (శ్రీగాయత్రీ జూనియర్ కాలేజి), బి.రవళిక ( సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి). -
కోనేరులో పడి విద్యార్థి మృతి
చిల్లాపురం (సంస్థాన్ నారాయణపురం) న్యూస్‌లైన్: కోనేరులో పడి ఓ విద్యార్థి మృతిచెందిన సంఘటన శనివారం మండలంలోని చిల్లాపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెంది న మేకల రామకృష్ణ(16) సంస్థాన్ నారాయణపురంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తల్లిద ండ్రులు పద్మ, పెద్దులు వ్యవసాయం తో పాటు మేకలను పెంచుతున్నారు. ఉదయం పత్తిచేలకు మందు వేయడానికి తల్లిదండ్రులు తమ వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. వారికి సాయం చేసేందుకు రామకృష్ణ, తన తమ్ముడితో కలసి మేకలను తోలుకొని అక్కడికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చే సమయంలో మందు చల్లిన జబ్బకు మట్టి అంటింది. దానిని కడిగేందుకు రామకృష్ణ శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో కడిగేందు కు వెళ్లాడు. అది ప్లాస్టిక్ జబ్బ కోనేరు లో పడింది. దాన్ని పట్టుకునేందుకు రామకృష్ణ నీటిలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక నీటి లో మునిగిపోయాడు. తమ్ముడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి కోనేటిలో దూకి రామకృష్ణను బయటికి తీశారు. అప్పటికే అతడు మృతిచెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.