సుల్తానాబాద్, న్యూస్‌లైన్ : సుల్తానాబాద్‌లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశారుు. అశోక్‌నగర్, మార్కండేయ కాలనీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఒక్కసారిగా దాడి చేయడంతో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిలో కె.మల్లేశం, జి.మల్లేశం, గజభీంకార్ జగన్, సి.అనిల్, ఎ.అమృతమ్మ, కె.సిరిమల్లి, పస్తెం అపర్ణ, సముద్రాల రమేశ్, కె. శ్రీనివాస్ ఉన్నారు. కుటుంబ సభ్యులు గమనించి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్ శ్రీనివాస్ ప్రాథమిక వైద్యం చేసి కరీంనగర్ ఆస్పత్రికి సిఫారసు చేశారు. రోగులను 108 వాహనంలో తరలించారు. సమాచారం అందుకున్న సర్పంచ్ అంతటి అన్నయ్య ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులకు సహాయ చర్యలు చేపట్టడంతోపాటు జిల్లా వైద్యాధికారి బాలుతో ఫోన్‌లో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు.
ముగ్గురి పరిస్థితి విషమం
మార్కండేయ కాలనీలోని పస్తెం చంద్రయ్య-రజిత కూతురు అపర్ణ(5నెలలు)ను ఇంటి ముందు మంచంలో పడుకోబెట్టి తల్లి పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో పిచ్చికుక్క దాడి చేసింది. చిన్నారి ముఖంపై తీవ్రగాయూలయ్యూరుు. ఆమెతోపాటు జి.మల్లేశం, గజభీంకార్ జగన్‌ను సైతం తీవ్రంగా గాయపర్చడంతో వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్, హైదరాబాద్‌కు తరలించారు.
రక్కసి కుక్కలు
Published Wed, Sep 18 2013 3:29 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM