
కరీంనగర్ హెల్త్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో అధునాతన వైద్య పరికరాలు, మిషనరీతో ఏర్పాటు చేసిన మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో అసౌకర్యాలతో గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విరిగిన బెడ్లు, చినిగిన పరుపులు దర్శనమిస్తున్నాయి. బెడ్‌షీట్లు ఇవ్వడం లేదు. మెరుగైన సేవల కోసం ఎంతో దూరం నుంచి వస్తున్న పేద రోగులకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా సౌకర్యాలు అందడం లేదు. ఈ కేంద్రం ఏర్పాటు చేసి దాదాపు 8 నెలలవుతున్నా.. ప్రభుత్వం మంజూరు చేసిన బెడ్లు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment