సాక్షి, కరీంనగర్: జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కరోనా రోగి మృతి కలకలం రేపుతోంది. ఆక్సిజన్ అందక బెడ్ పైనుంచి కింద పడి కరోనా బాధితుడు సోమవారం మృతి చెందడంతో అక్కడ ఆందోళన నెలకొంది. రోగి మృతికి వైద్యులు, ఆసుపత్రి సిబ్బందితో పాటు ప్రభుత్వమే కారణమంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన బాటపట్టారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం మేడిపల్లి సత్యం మీడియాతో మాట్లాడుతూ... గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన వృద్దుడు కరోనాతో ఆసుపత్రిలో చేరితే సరైన వైద్యం అందించక, పట్టించుకునేవారు కానరాక కింద పడి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఎల్లో మీడియా క్షణక్షణం ప్రజల్ని భయపెడుతోంది)
ఆస్పత్రి నిర్వాకం, వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని, ఆయన రాజీనామా చేయకుంటే గవర్నర్ బర్తరఫ్ చేయాలని కోరారు. ఆస్పత్రి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన బాధితుడి కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరోనా బాధితులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందేలా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. (చదవండి: వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత ఫైర్..)
Comments
Please login to add a commentAdd a comment