500 పడకల స్థాయి పెంపుపై ప్రజల ఆశలు
కరీంనగర్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, మంచిర్యాల, కుమ్రంభీం... ఈ ఐదు జిల్లాల ప్రజలకు అపరసంజీవని కరీంనగర్ జిల్లాకేంద్ర ఆస్పత్రి. దాదాపు ఏడు దశాబ్దాల క్రితం 48 పడకలతో మొదలై.. ఆ తర్వాత స్థాయి పెరుగుతూ వస్తున్నా ఇప్పటికీ 350 పడకలకే పరిమితమైంది. రోగుల రద్దీకి అనుగుణంగా కరీంనగర్ ప్రభుత్పాస్పత్రిని 500 పడకలుగా అప్‌గ్రేడ్ చేయూలన్న కల మాత్రం నెరవేరడం లేదు. తాజాగా జిల్లాల పునర్విభజనలో కొత్తగా ఆవిర్భవించిన జిల్లా కేంద్రాల్లోని ఏరియూ ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేయడంపై సర్కారు దృష్టి సారించింది. ప్రస్తుతం ఐదు జిల్లాల ప్రజలకు సేవలందిస్తున్న కరీంనగర్ ఆస్పత్రి స్థాయిని పెంచితే మెరుగైన వైద్యసేవలందుతాయని ప్రజలు ఆశపడుతున్నారు. మంత్రి ఈటల రాజేందర్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందించాలని కోరుతున్నారు.
కరీంనగర్ హెల్త్ : కరీంనగర్ ప్రభుతాస్పత్రి 48 పడకలతో మొదలై 1957లో 108 పడకలకు చేరింది. అనంతరం 257 పడకల స్థారుుకి పెంచారు. 1983 సంవత్సరంలో 350 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం 500 పడకల ఆస్పత్రిగా మార్చేందుకు అదనంగా మరో 150 పడకల సామర్థ్యంతో ప్రసూతి పిల్లల ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. కానీ ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు వెయ్యి మందికి తగ్గకుండా రోగులకు సేవలు అందిస్తోంది. రోజూ 300కి పైగా ఇన్‌పేషెంట్లుగా సేవలు పొందుతున్నారు. మంచిర్యాల, కుమ్రంభీం, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల నుంచి నిత్యం రోగులు వస్తుంటారు. అయితే కరీంనగర్ జిల్లా కేంద్ర ఆస్పత్రి పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. శిథిలావస్థకు చేరిన భవనం, చాలీచాలని సిబ్బంది, పూర్తికాని పిల్లల ఆస్పత్రితో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యసిబ్బంది ఉద్యోగ విరమణ పొందుతుండటంతో పోస్టులన్నీ ఖాళీ అవుతున్నాయి. రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నా పోస్టులను భర్తీ చేయడం లేదు. కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యులను నియమిస్తుండటంతో వారు సరిగ్గా విధులు నిర్వర్తించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
వైద్యులు, సిబ్బంది కొరత
ప్రభుత్వ ఆస్పత్రిలో 234 మంది సిబ్బందికి ప్రస్తుతం 180 మంది మాత్రమే ఉన్నారు. సివిల్ సర్జన్లు 10 మందికి ముగ్గురే ఉన్నారు. డెప్యూటీ సివిల్ సర్జన్లు ఇద్దరు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 21 మంది విధుల్లో ఉన్నారు. హెడ్‌నర్సులు, స్టాఫ్‌నర్సులు 78 మందికి 70 మంది, ఫార్మసిస్టులు 8 మంది, ల్యాబ్‌టె క్నీషియన్లు నలుగురు ఉన్నారు. పిల్లల డాక్టర్లు ఇద్దరున్నప్పటికీ ఐదుగురిని నియమించాల్సిన అవసరముంది. ప్రస్తుతం రోగుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల్లో వైద్యసిబ్బంది సంఖ్యను రెండింతలు పెంచాలని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
శిథిలావస్థలో ప్రసూతివార్డు
ప్రసూతివార్డు శిథిలావస్థలో ఉంది. వెంటనే దాన్ని తొలగించి కొత్త భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. కొత్త భవనానికి ప్రతిపాదనలు పంపాలని గత కలెక్టర్ ఆదేశాలు సైతం జారీ చేశారు. నలభై ఏళ్ల క్రితం వేసిన మురుగునీటి పైపులైన్ నిరుపయోగంగా మారింది. మార్చురీ భవనం పూర్తయినా ప్రారంభించలేదు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ఈ ఆస్పత్రిలో నిర్మిస్తున్న 150 పడకల భవనం మూడేళ్లుగా పూర్తికాలేదు. డిజైన్ బాగాలేదని, వార్డుల్లో గదుల నిర్మాణం సరిగ్గా లేదని రెండుసార్లు కూల్చివేశారు.
ఐసీయూకూ అరకొరే...
ఐసీయూకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయూల్సిన అవసరం ఉంది. ఇక్కడి సిబ్బంది షిఫ్టుల వారీగా వార్డుల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ముగ్గురు వైద్యులు, ఒక అనస్థీషియ(మత్తు డాక్టర్) ఉన్నారు. కాల్ ఆన్ డాక్టర్లుగా ముగ్గరు ఉన్నారు. అయితే పూర్తి అయిన ఎంబీబీఎస్ వైద్యులు ముగ్గురు, మత్తు వైద్యులు ముగ్గురు అవసరం ఉంది. ప్రతి షిఫ్టుకు ఇద్దరు నర్సులు విధులు నిర్వర్తిస్తుండగా, వీరి సంఖ్యను ఐదుకు పెంచాల్సిన అవసరముంది.
నర్సింగ్‌స్కూల్ భవనం
నర్సింగ్‌స్కూల్ విద్యార్థులు సొంత భవనం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో నర్సింగ్ స్కూల్ నిర్వహిస్తున్నారు. అరకొర వసతుల మధ్యే విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. మొత్తం 110 మంది విద్యార్థులుండగా ఒక్కో క్వార్టర్స్‌లో 30 మంది ఉంటున్నారు. మూడేళ్లుగా ఉపకార వేతనాలు అందడం లేదు.
ప్లేట్‌లేట్ మిషన్ మూలకే...
ప్లేట్‌లేట్ మిషన్ ఆపరేట్ చేయడానికి పర్మినెంట్ టెక్నీషియన్ లేక మూలకు పడి ఉంటుంది. నాలుగేళ్ల క్రితం రూ.33 కోట్లతో సింగిల్‌డోజర్ ప్లేట్‌లేట్ మిషన్ ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో తక్కువ వేతనం ఇస్తుండటంతో వారు కొది రోజులకే ఉద్యోగం వదిలి వెళ్లిపోతున్నారు. సిబ్బంది లేని కారణంగా ప్లేట్‌లేట్ మిషన్ గతేడాది నిరుపయోగంగా ఉంది.
ఆస్పత్రిలో కల్పించాల్సిన సౌకర్యాలు
150 పడకల మెటర్నిటీ చిల్డ్రన్ హాస్పిటల్ ఏర్పాటు
నర్సింగ్ స్కూల్, హాస్టల్ భవనాల నిర్మాణం
ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు
ఎంఆర్‌ఐ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు
సోలార్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఏర్పాటు
10 అంబులెన్స్‌లు నిర్వహణ
ప్రస్తుతం 234 ఉన్న సిబ్బందిని 500లకు పెంచాలి
సౌకర్యాలు పెంచాలి
ఆస్పత్రిని అభివృద్ధి చేయూలి. 500 పడకల ఆస్పత్రిగా మార్చితే అందరికీ సేవలందుతారుు. జిల్లాలు విభజించినా అందరూ ఇక్కడికే వస్తుంటారు. మా ప్రాంతం సిద్దిపేటకు పోరుున ఇక్కడికే వస్తున్నం. డాక్టర్ల సంఖ్యను పెంచాలి.
- కుమార్, కోహెడ
వైద్యులను నియమించాలి
గైనకాలజిస్ట్‌ను, పిల్లల డాక్టర్‌ను నియమించాలి. తగినంత సంఖ్యలో వైద్యులు లేకపోవడంతో సేవలు సరిగ్గా అందడం లేదు. పొద్దులతో వచ్చినవాళ్లు ఎంతసేపు డాక్టర్ పరీక్షల కోసం ఉంటరు? ఇప్పటికే ఇక్కడ గంటసేపు నుంచి ఉంటున్నం. డాక్టర్లను నియమించాలి.
- ఎం.సత్యనారాయణ, పెద్దపల్లి
అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
కొత్త జిల్లాలు ఏర్పాటైనా ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య తగ్గదు. అక్కడి ఆస్పత్రుల వారు ఇక్కడికే రెఫర్ చేస్తారు. పిల్లలవార్డు మరమ్మతులు పూర్తయ్యూరుు. 150 పడ కల ఆస్పత్రి రీడిజైన్‌తో ఆలస్యమవుతోంది. రూ.21కోట్లు ఖర్చయ్యూరుు. ఇటీవల మరో రూ.6కోట్లు వచ్చారుు. త్వరలోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.
- డాక్టర్ సుహాసిని, సూపరింటెండెంట్