చిలుకూరులో ఏర్పాటుచేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య కాంస్య విగ్రహాన్ని ఆది వారం ఆవిష్కరించారు. నర్సయ్య పేదల పక్షాన నిలబడి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వక్తలు కొనియాడారు.
చిలుకూరు, న్యూస్‌లైన్: తెలంగాణ సాయుధ పోరాటానికి పురిటిగడ్డగా నిలిచిన నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ తరఫున నిలిచి దొడ్డా నర్సయ్య పోరుబిడ్డగా నిలిచారని మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు కొనియాడారు. నాడు భూస్వామ్య, జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన పాత్ర ఎనలేనిదన్నారు. మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు దొడ్డా నర్సయ్య 15 వ వర్ధంతి సందర్భంగా చిలుకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఎందరో కమ్యూనిస్టు నాయకులను తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
పేదల పక్షాన నిల బడి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచాడని అన్నారు. అంతటి మహనీయుడిని ప్రతి కయ్యూనిస్టు ఆదర్శంగా తీసుకొని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి తరానికి దొడ్డా నర్సయ్య ఆదర్శప్రాయుడని రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నేటి వరకూ కమ్యూనిస్టు పార్టీ జిల్లాలో బలంగా ఉన్నదంటే దొడ్డా నర్సయ్య లాంటి నేతల ఉద్యమ ఫలితమేనన్నా రు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీకి అనాడు ఎంతో స్ఫూర్తినిచ్చి పేదల కోసం పరితపించిన డీఎన్ (దొడ్డా నర్సయ్య), బీఎన్‌లు స్టెన్‌గన్ లాంటివారని అన్నారు. ముందుగా సీపీఐ జెండాను, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా సీపీఐ నల్లగొండ, కృష్ణా జిల్లాల కార్యదర్శులు మల్లేపల్లి ఆదిరెడ్డి, అక్కినేని వనజ, సీపీఎం జిల్లా కార్యదర్శి నం ద్యాల నరసింహారెడ్డి, సీపీఐ విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి చలసాని రాఘవేందర్‌రావు, నల్లగొండ జిల్లా మాజీ కార్యదర్శి దొడ్డా నారాయణరావు, వివి ద పార్టీల నాయకులు బద్దం బద్రారెడ్డి, గన్నా చంద్రశేఖర్, ఉప్పల కాంతారెడ్డి, నంద్యాల రామిరెడ్డి, రత్నాకర్‌రావు, పశ్య పద్మ, ముత్తవరపు పాండు రంగారావు, కేవీఎల్, పోటు ప్రసాద్, కొండా కోటయ్య, దొడ్డా పద్మా, పుట్టపాక శ్రీని వాస్ యాదవ్, మేకల శ్రీను, బెజవాడ వెంకటేశ్వర్లు, బజ్జూరి వెంకట్ రెడ్డి, వివిద పార్టీల నాయకులు చింతకుంట్లు లక్ష్మినారాయణరెడ్డి, వాడపల్లి వెంకటేశ్వర్లు, డేగబాబు, కందిబండ సత్యం, పాలకూరి బాబు, ధనుంజయనాయుడు, కంబాల శ్రీను పాల్గొన్నారు.
తల్లి మరణవార్తతో వెనుదిరిగిన కె.నారాయణ
దొడ్డా నర్సయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయ ణ మాతృమూర్తి మరణవార్తతో మార్గమధ్యం నుంచే వెనుదిరిగి వెళ్లిపోయా రు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన జిల్లాలోని నార్కట్‌పల్లి వద్దకు చేరుకోగానే తల్లి మరణవార్త తెలి సింది. దీంతో ఆయన హాజరు కాలేకపోయారు.
పోరు బిడ్డ.. మన దొడ్డా
Published Mon, Jan 20 2014 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement