chilkur
-
గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు.. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)
-
పింఛన్ కోసం వెళ్తే చనిపోయావన్నారు
సాక్షి, హైదరాబాద్: పింఛన్ కోసం అధికారులను ఆశ్రయించిన వృద్ధురాలికి వింత అనుభవం ఎదురైంది. పింఛన్ మంజూరైందో, లేదో తెలుసుకునేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్తే ఆన్లైన్లో ఆమె చనిపోయినట్లుగా ఉందన్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శుక్రవారం జరిగింది. చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామానికి చెందిన బుడిగె వెంకటనర్సమ్మ వృద్ధాప్య పింఛన్ కోసం ఏడాదిక్రితం దరఖాస్తు చేసింది. ప్రభుత్వం ఇటీవల కొత్త పింఛన్లు మంజూరు చేయడంతో ఆ జాబితాలో తన పేరు ఉందో లేదో తెలు సుకునేందుకు కుమారుడు నరేష్‌తో కలిసి వెంకటనర్సమ్మ శుక్రవారం ఉదయం పంచాయతీ కార్యాలయానికి వెళ్లింది. వెంకటనర్సమ్మ ఆధార్ కార్డు నంబర్‌ను కార్యదర్శి సౌమ్య ఆన్లైన్లో ఎంటర్ చేయగా ఆమె చనిపోయినట్లుగా చూపించింది. అనంతరం మీసేవ, మండల పరిషత్ కార్యాలయాల్లో విచారిస్తే.. అక్కడెక్కడా ఆ ధ్రువీకరించిన దాఖలాలు లేవు. కానీ ఆన్లైన్లో మాత్రం మరణించినట్లుగా నమోదై ఉండడంతో వెంకటనర్సమ్మ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాను బతికే ఉన్నానని, పింఛన్ మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటోంది. చదవండి: Munugodu Politics: మునుగోడు బరిలోకి వైఎస్సార్టీపీ! -
కారు చక్రం కింద నలిగిన చిరుప్రాయం
సాక్షి, సూర్యాపేట : కారు చక్రం కింద ఓ చిరుప్రాయం నలిగిపోయింది. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన సంక్రాంతి విజయ్‌శేఖర్, శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కాగా, విజయ్‌శేఖర్ ఇంటికి మధ్యాహ్న సమయంలో బంధువులు కారులో వచ్చారు. వారు ఇంట్లోకి వెళ్లగానే డ్రైవర్ ఎదురుగా ఉన్న చెట్టుకింద కారును రివర్స్‌లో పార్క్ చేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత పని నిమిత్తం శిరీష ఎదురింట్లోకి వెళ్లగా తల్లిని చిన్నకూతురు షణ్ముఖ (18నెలలు) కూడా అనుసరించింది. ఆ ఇంటి ఎదురుగానే నిలిపిన కారు వెనుక డోరు పక్కన షణ్ముక ఆడుకుంటోంది. గమనించని తల్లి శిరీష ఒక్కతే ఇంట్లోకి వెళ్లింది. ఇంతలోనే కారు డ్రైవర్ అక్కడకు వచ్చి చిన్నారిని గమనించకుండా వాహనాన్ని ముందుకు కదిలించాడు. అయితే, ఈ సమయంలో షణ్ముక వెనుక చక్రం వద్ద ఆడుకుంటూ దానికింద పడిపోయింది. దీంతో టైరు బాలిక తలపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. షణ్ముక కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి వచ్చి కోదాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. అప్పటి వరకు ఆడుకుంటూ ఉన్న చిన్నారి అంతలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటగా ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. -
దేవుళ్లకు జాతులు, కులాలు ఉండవు!
మల్లెపల్లి లక్ష్మయ్యగారి వ్యాసాన్ని బాధతో చదివాను. ఆయన మేధావి. జ్ఞానసంపన్నుడు. కాలానుగుణ మార్పులను సూక్ష్మంగా చూస్తున్నవారు. అలాంటి వ్యక్తి ‘దేవుడికీ తప్పని కులవివక్ష’ అనే వ్యాసం రాయడాన్ని (సాక్షి 29–08–2019) సున్నితంగా తిరస్కరిస్తున్నాను. వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క కాలంలో సద్గురు రవిదాస్ మహరాజ్ లాంటి అవతార పురుషులు పుడుతూనే ఉన్నారు. వారిని సమాజం గుర్తిం చింది. వారి సందేశాలను భక్తితో స్వీకరించాయి. సాధువుల జాతి, పుట్టుక అడుగకు, వారి జ్ఞానాన్ని స్వీకరించు. ఒరను పట్టించుకోకు కత్తి పదునును చూడు. సంత్ రవిదాస్ జయంతి సమావేశాల్లో చాలాసార్లు నేను పాల్గొన్నాను. ఢిల్లీలో సంత్ రవిదాస్ దేవాలయాన్ని కూలగొట్టినప్పుడు ముందుగా స్పందించిన వాణ్ణి నేనే.. సంత్ రవిదాస్ దళితులకే కాదు.. మానవజాతికే గురుతుల్యులు. 2018 ఏప్రిల్ 16 సాయంత్రం 4 గంటలకు ఒక దళిత శ్రీ వైష్ణవ భక్తుడిని నా భుజాలపై కూర్చోబెట్టుకుని జియాగూడ శ్రీరంగనాథ స్వామి ఆలయంలోనికి మేళతాళాలతో భక్త బృందం వెంటరాగా తీసుకువెళ్లాను. భక్తుల గోవింద నామ స్మరణ, తిరుప్పాణాళ్వారు రచించిన ‘అమలనాది పిరాన్ పాశురగానం,’ అన్నమయ్య రచించిన ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ అనే గానాల మధ్య దేవుడిముందు అందరూ సమానమే అని మరోమారు నిజం చేస్తూ, మునివాహన ఉత్సవం బ్రహ్మాండంగా నిర్వహించాం. భగవద్రామానుజులవారి 1000వ జయంతి సంవత్సరంలో ఈ ఉత్సవం జరగడం విశేషం. వైష్ణవాచార్య గురుపరంపరలో నమ్మాళ్వారు ప్రథమాచార్యులు. నమ్మాళ్వారు శూద్రజాతిలో జన్మించారు. శ్రీవైష్ణవులు పన్నెండుగురు ఆళ్వారులను భక్తితో పూజిస్తారు. పన్నెండు మంది ఆళ్వారులు వివిధ వర్ణాలలో జన్మించి పూజలందుకుంటున్నారు. వీరిలో తిరుప్పాణ్ ఆళ్వార్ దళిత కులానికి చెందినవారు. ఈ పరమ భక్తుడు శ్రీరంగనాథునికి తన జీవితాన్ని అంకితం చేసి శాస్త్రబద్ధ జీవనం చేస్తూ శ్రీరంగంలోని ఆలయం వెలుపలి నుండే రంగనాథుని గుణగానం చేస్తూ ఉండేవారు. పరమ భక్తుడైన ఈ ఆళ్వారుని, ఆలయ అర్చకులైన శ్రీలోక సారంగముని గుర్తించారు. శ్రీరంగనాథుని ఆజ్ఞానుసారం శ్రీలోకసారంగముని తిరుప్పాణాళ్వారుని కలుసుకుని, ఆ భక్తాగ్రేసరుని తన భుజాలపై కూర్చుండబెట్టుకుని ఆలయ ప్రవేశం చేయించమని తనను స్వామి ఆదేశించారని తెలి పారు. దైవాజ్ఞకు ఎదురు చెప్పలేక ఆళ్వారు అంగీకరించారు. ఈ విధంగా ‘మునివాహనునికి’ సంతోషకరమైన స్వామి దర్శనం లభించింది. ఈ సంఘటన దాదాపు 2,700 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు మన సమాజంలో కులాల మధ్య వివక్ష, అగౌరవం అధికంగా కనిపిస్తున్నాయి. కులాల నడుమ చెలరేగుతున్న అగౌరవం, వివక్షతలు తొలగాలనీ, అందరినీ సమానంగా గౌరవించాలన్న సందే శం ఇచ్చే విధంగా, నేను మునివాహన సేవను నిర్వహించాను. ఒక దళిత భక్తుని తిరుప్పాణాళ్వారు వలె నా భుజాలపై కూర్చుండబెట్టుకుని అమలనాది పిరాన్ పఠిస్తూ ఆలయ ప్రవేశం చేశాను. సమాజంలో ఎస్సీ, ఎస్టీ సోదరులపట్ల చూపుతున్న దుర్వ్యవహారం ఆపివేసి, ప్రజ లకు వారిపట్ల గౌరవభావాన్ని ఇనుమడింప చేయడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం ఇది. నేను 2018వ సంవత్సరం జూన్ నెలలో గుంటూరులో, జూలై నెలలో నెల్లూరులో ఈ ఉత్సవాన్ని నిర్వహిం చాను. నేను చేసిన ప్రయత్నాలు తప్పుగా మా ధర్మ శాస్త్రజ్ఞులు పరిగణించలేదు. మనువాదులుగా మీరు నిందించిన వారెవరూ నన్ను దూషించలేదు. మల్లెపల్లి లక్ష్మయ్యగారు తమ వ్యాసంలో పేర్కొన్న అంశాలు సనాతన ధర్మం కానీ, రామానుజ సాంప్రదాయం కానీ ఎన్నటికీ ఒప్పుకోవు. కొంతమంది చేసే దుశ్చర్యలకు మొత్తం సమాజాన్ని నిందించే పని చేయడం సబబు కాదు. మనమందరం కలిసి మంచి సమసమాజ స్పృహను, చైతన్యాన్ని లోకంలో ఆవిష్కరిద్దాం. లక్ష్మయ్యగారూ.. మీరూ రండి. ఇదే మా ఆహ్వానం. వ్యాసకర్త: సీఎస్ రంగరాజన్, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు csranga@gmail.com -
అర్చకులపైనా మీ ప్రతాపం?!
సందర్భం అఖిలపక్ష సమావేశం 2007లో సెలక్ట్ కమిటీ నివేదిక ప్రాతిపదికన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం దేవాదాయ చట్టాన్ని సవరించింది. అంతే... ఆయన అస్తమయంతో అంతా స్తబ్దం... ఇప్పటికి 9 సంవత్సరాలు గడిచినా సవరించిన ఆ చట్టాన్ని అమలుపరిచే చర్యలు మాత్రం శూన్యం. మన దేశంలో సమస్యలెన్ని ఉన్నాయో, కమిటీలు కూడా అన్ని ఉన్నాయి. మలమూత్ర శాలల నుంచి రైతుల, విద్యార్థుల వరకు... సవాలక్ష సమస్యలపై లక్షల పేజీల నివేదికలను ఈ కమిటీలు సమర్పిస్తుంటాయి. వీటిలో వెలుగు చూడనివి కొన్ని అయితే, ఎక్కువ భాగం అమలుకు నోచుకోనివే. ఒక ప్రభుత్వం పోయి, ఇంకో ప్రభుత్వం వస్తుంటుంది. ప్రజా స్వామ్యాన్ని ఇవి ఎంతగా గౌరవిస్తాయంటే సమాధానం దొరకని ప్రతి సమస్యకు కమిటీ ఏర్పాటే పరిష్కారంగా భావిస్తాయి. తీరా కమిటీలు, నివేదికలు అన్నీ అయి సిఫార్సులు చేతికందే సమయానికి పాత్రధారులు మరో పాత్రలతో క్షణం తీరిక లేకుండా ఉంటారు. అమూల్యమైన డబ్బూ, కాలాన్ని వెచ్చించి కమిటీలు మల్లగుల్లాలుపడి అందించిన నివేదికలు, సిఫార్సులు, విశ్లేషణలు.. అధి కారుల బల్లలమీద అతి సహజంగా మరణిస్తుంటాయి. ఈ మధ్య అర్చకుల జీతాలలో కోతలు విధిస్తూ దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయం హేయమైనది, హాస్యాస్పదమైనది. ఇలాంటి ఆదే శాలు, హెచ్చరికలు ఎన్ని జారీ అయినా చట్టంలో అసంబద్ధత, అస్పష్టత, అసమగ్రత కొనసాగినంతకాలం మన సనాతన ఆలయ వ్యవస్థ స్ఫూర్తికి ఈ పాశవిక చట్టం కోరల్లోని విష వాయువులు సోకుతూనే ఉంటాయి. దీని వెనుక ఉన్న విషాదగాథ 1987 నాటిది. గుళ్లలో అర్చకత్వం చేసి, ఇతరత్రా సేవలు చేసి అర్ధాకలితో బొటాబొటీ జీవితాలు గడిపే అర్భకుల కథ ఇది. సుప్రీంకోర్టు గడపలు కూడా తొక్కిన తరువాత రెండు కమిటీలను కోర్టు నియమించింది. వేతన స్కేళ్ల కమిటీ, అర్చకుల సంక్షేమ కమిటీ. వీటి నివేదికలను కూడా ప్రభుత్వం ఆమోదించి కోర్టు ముందుంచింది. కోర్టువారు కూడా సంతోషించి 1997లోనే వాటి అమ లుకు ఆదేశించారు. అంతే! ఆ తరువాత అదేమీ ఎరగనట్లు ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. 1987లో చల్లా కొండయ్య కమిషన్ సిఫార్సుల్ని గుడ్డిగా నమ్మి అత్యంత ఆర్భాటంగా, హడావుడిగా, ఆగమేఘాలమీద అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిందూ దేవాదాయ, ధర్మాదాయ చట్టం (30/87) 30 ఏళ్ల కాలంలో ఎన్నెన్నో మలుపులు తిరిగింది. పలు కింది కోర్టుల్లో పిటిషన్లు, హైకోర్టులో, సుప్రీంకోర్టులో లిటిగేషన్లు, తాత్కా లిక ఇంజెంక్షన్లు, కొన్ని సమర్థనలు, కొన్ని రద్దులు, కోర్టు నుంచి కొత్త ఆదేశాలు, ఎండోమెంట్ కమిషనర్ల అత్యుత్సాహభరిత సర్క్యులర్లు.. ఇవన్నీ చవిచూస్తూనే ఈ చట్టం– దేవాలయ వ్యవస్థలో కీలకమైన అర్చక వ్యవస్థకి మాత్రం భయంకరమైన చేదు అనుభవాన్ని చవిచూపించింది. ప్రసాదాలు, హారతిపళ్లెంలో వాటాలు సహా అన్ని వాటాలకు అర్చ కులు ‘చట్టప్రకారం అనర్హులు.. అనర్హులు’ అని ఎత్తిచూపుతూ, వారిని నిస్సహాయుల్ని చేసే, దౌర్జన్యాలు జరిగాయి. స్వార్థంతో అనర్హుల్ని అర్చ కులుగా చేసే ప్రయత్నంలో వృద్ధ పూజారుల్ని సైతం దుర్భాషలతో అవ మానపరిచిన దుర్ఘటనలు జరిగాయి. అర్చకుల శ్రమను సొంత ప్రయోజ నాల కోసం దోచుకునే దుస్సాహసాలు జరిగాయి. ఎక్కడ్నుంచి ఎక్కడి కైనా బదిలీ చేసెయ్యొచ్చునంటూ అర్చక కుటుంబాల్ని భయోత్పాతానికి గురిచేసే కుయుక్తులు ప్రయోగించారు. తమ అక్రమార్జనలకి సహకరించే దుష్ట శక్తుల్ని ధర్మకర్తలుగా నియమింపజేసే దురాగతాలు జరిగాయి. అవమానభారంతో, ఆకలి బాధతో, కళ్లలోంచి రక్తం చిమ్మేటంతటి ఆక్రో శంతో ఒకరిద్దరు అర్చకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చల్లా కొండయ్య కమిషన్ నివేదిక ఆధారంగా–ఆలయ వ్యవస్థకి జీవగర్రలాంటి అర్చక కుటుంబాల మీద గత పదహారేళ్లుగా సాగిన, ఇంకా సాగుతున్న ఈ దాడితో శారీరక, మానసిక క్షోభకి గురవుతున్న నిస్సహాయ అర్చక కుటుంబాల సమస్యకి శాశ్వత పరిష్కారం చూపేం దుకు వైఎస్సార్ చిత్తశుద్ధితో ప్రయత్నించారు. 2004లో వైఎస్సార్ ప్రభుత్వం కొలువుదీరింది. అఖిలపక్ష సమావేశం 2007లో వైఎస్సార్ ప్రభుత్వం సెలక్ట్ కమిటీ నివేదికతో చివరకు దేవాదాయ చట్టాన్ని సవ రించారు. అంతే. ఆయన అస్తమయంతో అంతా స్తబ్దం.. ఇప్పటికి 9 ఏళ్లు గడిచినా చట్టాన్ని అమలుపరిచే చర్యలు శూన్యం. కడుపుకాలిన బాధితులు 2010లో సమ్మె చేయక తప్పలేదు. ఇంతకూ వీరు అడుగుతున్నది దేవ రహస్యం కాదు. పీఆర్సీ ప్రకారం జీతాలివ్వండని అర్చకులు, దేవాలయ సిబ్బంది కోరుతున్నారు. సీని యర్లేమో పింఛను కూడా అడుగుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమ బద్ధీకరణను, మరికొందరు కారుణ్య నియామకాల్ని కోరుకుంటున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, యాదగిరి గుట్ట, ద్వారకా తిరుమల, బాసర, వేములవాడ, భద్రాచలం దేవాలయాలకు చెందిన అర్చకులు, ఆలయ సిబ్బంది అంతా సమ్మె చేయడంతో ప్రభుత్వం అక్టోబర్ 24, 2010న ఒక కమిటీని నియమిస్తూ జీఓ (జీవో ఎంఎస్ నం. 1395) కూడా జారీ చేసింది. ఈ కమిటీ జనవరి 5, 2011న నివేదిక కూడా ఇచ్చేసింది. ఆ మరుసటి రోజే ప్రభుత్వం ఆల యాల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు (ఈఓలకు) ఇతర ఉద్యోగులకు పీఆర్సీ స్కేళ్లు వర్తింపజేస్తూ జీఓ కూడా జారీ చేసేసింది. తమాషా ఏమిటంటే.. భక్తుల దక్షిణలే గుళ్లకు ఏకైక ఆదాయవనరు. భక్తులిచ్చే విరాళాల్లో 21.5 శాతం ప్రభుత్వమే గుంజేసుకుంటుంది. దేవా దాయ శాఖ కమిషనర్, ఉద్యోగులు, కార్యనిర్వాహక సిబ్బంది జీతాలన్నీ ఈ నిధుల నుండే చెల్లిస్తారు. ఈ సోకులు అనుభవిస్తున్న వారంతా ప్రభు త్వానికి చెందిన ‘వైట్‌కాలర్’ ఉద్యోగులు కాగా, గుడి సిబ్బంది మాత్రం దిక్కూ మొక్కూ లేని ద్వితీయ శ్రేణి పౌరులు. జనవరి 5, 2011 నాటి నివేదికను ప్రభుత్వం ఆమోదించినా అమలు చేసే నాథుడేలేడు. కడుపు చించుకుంటూ దాదాపు 20వేల మంది ఆలయ సిబ్బంది మరో మారు సమ్మెతో రోడ్డెక్కారు. అంతే, మరో కమిటీ సాక్షాత్కరించింది. ఇప్పుడు ఆ కమిటీ ఎక్కడుందో, ఏమైందో పత్తాలేదు. అర్చక కుటుంబాల సంక్షేమం కోసం సుప్రీంకోర్టు సూచించిన సమీ కృత పథకాన్ని అమలు చేయకుండా, వాళ్ల అర్చక స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తూ, అర్చక కుటుంబాల ఆక్రోశాల మధ్య వారిని శాశ్వతంగా ఆలయా ల్నుంచి తరిమివేసేలా– తద్వారా ఆలయ సంస్కృతి అంతరించిపో యేలా చేస్తున్న కొంతమంది స్వార్థపరులైన అధికారులు చెప్పే విధంగా ప్రభుత్వం నడవకూడదు. ప్రభుత్వం కోట్లాది మంది భక్తుల మనోభావా లను గౌరవించి దేవాలయాలను, అర్చక వ్యవస్థను పరిరక్షించే లక్ష్యంతో పనిచేయాలి. ఈ లక్ష్యాలకి కట్టుబడి పనిచేసే ప్రభుత్వం మాత్రమే పది కాలాలపాటు వర్ధిల్లాలని ఆలయ సంస్కృతీ పరిరక్షణాభిలాషులందరం ఆశిద్దాం. అలాంటి సంకల్పం ఈ ప్రభుత్వం తెచ్చుకుంటుందా?! ఆ పర మాత్మకే ఎరుక!! వ్యాసకర్త చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు : సీఎస్ రంగరాజన్ మొబైల్ : 98851 00614 -
వృద్ధుడు సజీవదహనం
చిలుకూరు: ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పు అంట్టుకొని వృద్ధుడు సజీవ దహనమైన సంఘటన ఆదివారం రాత్రి మండలంలోని బేతవోలులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యరమళ్ల ముత్తయ్య (80) పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. వృద్ధాప్యం వల్ల ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. పక్కనే ఉన్న కుమారుడి ఇంటి నుంచి ముత్తయ్య గుడిసెకు విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ నేపధ్యంలోనే షార్ట్‌సర్క్యూట్ జరిగి గుడిసెకు నిప్పంటుకుంది. గమనించిన కుమారుడు, స్థానికులు మంటలను అదుపు చేసి వృద్ధుడిని హుజూర్నగర్ ప్రజావైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. -
చిలుకూరులో సంక్రాంతి సంబురాలు
-
పట్నంలో పండగ సందడి..
-
నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ
మొయినాబాద్: రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డెరైక్టర్ డి.కృష్ణ తెలిపారు. మెయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో ఉన్న ఎస్బీహెచ్ ఆర్సెటీ కేంద్రంలో ఈనెల 31 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. కంప్యూటర్ బేసిక్స్ (30 రోజులు), బేసింగ్ ఫొటోగ్రాఫీ అండ్ వీడియోగ్రాఫీ (21 రోజులు), కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ బేసిక్ నెట్వర్కింగ్ (45 రోజులు) కోర్సుల్లో శిక్షణలు ఇస్తామన్నారు. 18 - 45 ఏళ్ల మధ్య వయసు కలిగి పదోతరగతి.. ఆపై చదివినవారు అర్హులని, ఆసక్తి ఉన్నవారు వెంటనే చిలుకూరు ప్రాంగణంలోని ఆర్సెటీ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9000778300, 9985318452, 9866689089 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. -
ముగ్గురు కూతుళ్లతోపాటు తల్లి ఆత్మహత్య
-
కలకలం రేపిన ‘ముజ్రా’
చిలుకూరు సమీపంలోని ఓ ఇంటిపై పోలీసుల దాడి 22 మంది యువకులు, 8 మంది యువతులు అరెస్టు మొయినాబాద్: అటవీ ప్రాంతం, జన సంచారం తక్కువగా ఉండటం, అనేక ఫాంహౌస్‌లు అందుబాటులో ఉండటం నగర శివారులో ముజ్రా, రేవ్ పార్టీల ఏర్పాటుకు అనుకూలంగా మారాయి. హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ మండలం చిలుకూరులో ఉన్న ఓ వెంచర్లో సోమవారం రాత్రి జరిగిన ముజ్రా పార్టీ స్థానికంగా కలకలం రేపింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన వస్త్ర వ్యాపారి ఆకాష్ వివాహం నగరంలోని ఎల్బీ నగర్లో జరిగింది. ఆ వివాహ వేడుకకు హైదరాబాద్, ముంబై, కలకత్త ప్రాంతాలకు చెందిన కొందరు స్నేహితులు హాజరయ్యారు. వివాహానికి విచ్చేసిన స్నేహితులకు ఆకాష్ పార్టీ ఇవ్వాలనుకున్నాడు. ఈ విషయాన్ని అతను జతిన్‌కు చెప్పాడు. అయితే జతిన్ పార్టీ విషయాన్ని అతని స్నేహితుడైన గౌరవ్‌కు తెలిపాడు. గౌరవ్‌కు పార్టీలు ఏర్పాటు చేసే దిలీప్ జైన్ అనే వ్యక్తి పరిచయమున్నాడు. రాజస్థాన్‌కు చెందిన దిలీప్‌జైన్ హైదరాబాద్‌లోనే ఉంటూ ఇలాంటి పార్టీలను ఏర్పాటు చేస్తుంటాడు. వివాహానికి వచ్చిన స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేయాలని దిలీప్జైన్కు గౌరవ్ చెప్పడంతో ముజ్రా పార్టీ ఏర్పాటు చేస్తానన్నాడు. మండల పరిధిలోని చిలుకూరులో ఉన్న గ్రీన్ హోమ్ వెంచర్లో ఆశీష్ జైన్ అనే వ్యక్తికి ఓ ఇళ్లు ఉంది. ఆశీష్ జైన్‌కు పార్టీలు ఏర్పాటు చేసే దిలీప్ జైన్‌కు పాత పరిచయం ఉండటంతో వెంచర్‌లోని ఇల్లును దిలీప్‌జైన్ అద్దెకు తీసుకున్నాడు. సోమవారం రాత్రి వెంచర్‌లోని ఇంట్లో ముజ్రా పార్టీని ఏర్పాటు చేశారు. ముంబై, అహ్మదాబాద్, కలకత్త, హైదరాబాద్‌కు చెందిన దిలీప్జైన్తోపాటు జినేష్ రాంనిక్, అంకిత్, జిగ్నేష్, భావేష్ పటేల్, రాసిక్ ప్రజాపతి, దీపేష్, గనత్రా జతిన్, గౌరవ్, శాంతిలాల్, జయేష్, దివ్యేష్, దివాంగ, శైలేష్, హర్షత్, ఆకాష్, అసత్, నగరానికి చెందిన డ్రైవర్లు షేక్ జిలాని, షేక్ ఆసిఫ్, ఎండీ షకిల్ హైమద్, నగరంలోని అల్వాల్‌కు చెందిన వర్కర్లు ఉమర్ రాజిరెడి,్డ మురళీ కృష్ణ, 8 మంది యువతులు పార్టీలో పాల్గొన్నారు. అర్ధరాత్రి సమయంలో డీజే పాటల హోరులో యువతులు నృత్యాలు చేస్తుంటే యువకులు వారిపై డబ్బులు వెదలజ్లుతూ ఎంజాయ్ చేస్తున్నారు. (ముజ్రా పార్టీలో యువతులు నృత్యాలు చేస్తూ తమ ఒంటిపై ఉన్న ఒక్కొక్క వస్త్రాన్ని విప్పేస్తూ నృత్యం చేస్తుంటారు. చివరకు నగ్నంగా తయారై నృత్యం చేస్తారు) వెంచర్‌లోని ఓ ఇంట్లో పార్టీ నడుస్తున్నట్లు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో సోమవారం అర్ధరాత్రి 12 సమయంలో ఆ ఇంటిపై దాడి చేశారు. మొత్తం 30 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విషయం తెలుసుకున్న మొయినాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న యువతీ యువకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సంఘటన స్థలంలో మద్యం బాటిళ్లు, కండోమ్స్ పాకెట్లు... ముజ్రా పార్టీ నిర్వహించిన ఇంట్లో మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లు లభించాయి. ఎస్ఓటీ పోలీసులు దాడి చేసిన సమయంలో యువతీ యువకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఎస్ఓటీ పోలీసులు పకడ్బందీగా దాడి చేయడంతో వారంతా ఆ ఇల్లు దాటి బయటకు పోలేకపోయారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న అనంతరం వారందర్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద ఉన్న రూ.1.21 లక్షల నగదు, 25 సెల్ఫోన్లు, 5 కార్లను సీజ్ చేశారు. మంగళవారం యువతీ యువకులను రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, మొయినాబాద్ సీఐ రవిచంద్ర ఉన్నారు. పార్టీల ఏర్పాటులో దిలీప్‌జైన్ పాత్ర కీలకం... నగర శివారులో రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలు ఏర్పాటు చేయడంలో దిలీప్‌జైన్ సూత్రధారిగా మారినట్లు పోలీసులు చెబుతున్నారు. రాజస్థాన్‌కు చెందిన దిలీప్‌జైన్ కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటూ నగర శివారుల్లోని రిసార్ట్స్, ఫాంహౌస్‌లలో పార్టీలు ఏర్పాటు చేస్తున్నాడు. గతంలోనూ అతను జవహర్‌నగర్, శామీర్‌పేట్, చేవెళ్ల ప్రాంతాల్లో ఇలాంటి పార్టీలు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. -
‘మిట్స్’లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
చిలుకూరు : మండలంలోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి బుధవారం కాలేజీలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి బంధువులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంకు చెందిన కె.రామకృష్ణ మిట్స్ కళాశాలలో బీ ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలు రాయాలంటే 65శాతం హాజరు నమోదు కావాల్సి ఉండగా సదరు విద్యార్థికి 64.8 శాతం ఉంది. అయితే హాజరు శాతం తక్కువగా విద్యార్థులను బీఫార్మస్సీ హెచ్ఓడీ కొన్ని రోజలుగా వేదిస్తున్నట్లుగా తెలిసింది. హాజరు శాతం తక్కువుగా ఉన్నదని ఫైనల్ పరీక్షలు రాయడానికి వీలు లేదని సంవత్సరం వృథా అవుతుందని భయపెట్టడంతో రామకృష్ణ ఆందోళనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వారు ఆరోపించారు. అదనపు ఫీజు కోసం.. రామకృష్ణకు హాజరు శాతం తక్కువుగా ఉండటంతో అదనంగా రూ. 10 వేలు చెల్లించాలని బీ ఫార్మసీ హెచ్ఓడీ వేదిస్తున్నట్లుగా పలువురు విద్యార్థులు ఆరోపించారు. అంతేకాకుండా కళాశాలకు రాని రోజులకు ఒక్కో రోజుకు రూ. 500 చొప్పున అదనపు రుసుం వేశారని పేర్కొన్నారు. దీంతో రామకృష్ణ నాలుగు రోజుల కళాశాలకు రాకపోవడంతో అతనికి అదనంగా రూ. 2వేలు ఫైన్ వేశారని తెలిపారు. మొత్తం రూ. 12 వేలు తెస్తేనే కళాశాలకు రావాలని, లేకుంటే రావద్దనడమే కాకుండా ఈ ఏడాది ఫైనల్ పరీక్షలు, ప్రాక్టికల్స్‌కు అనుమతించబోమని చెప్పడంతో రామకృష్ణ మనస్థాపానికి గురయ్యాడు. ఈ విషయమై బుధవారం తప్పనిసరిగా డబ్బులు చెల్లించాల్సిందేనని మంగళవారం విద్యార్థికి హెచ్ఓడీ సీరియస్‌గా చెప్పినట్లు తెలిసింది. ఈ విషయాన్ని భయట ఎవరికైనా చెప్పినా మార్కులు తక్కువగాగా వేస్తామని , ప్రాక్టికల్స్‌లో ఫైయిల్ చేస్తామని కూడా బెదిరించినట్లుగా వారు ఆరోపించారు. అదనపు ఫీజు వసూలు చేయలేదు -నర్సిరెడ్డి, మిట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కళాశాలలో అదనపు ఫీజులు వసూలు చేయడం లేదు. విద్యార్థిని కూడా ఎలాంటి వేదింపులకు గురి చేయలేదు. అతని ఇంటి వద్ద ఉన్న సమస్యల వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడగానే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి బాధిత విద్యార్థిని కూడా వారికి అప్పడించాం. కళాశాలకు పురుగుల మందు డబ్బాతో... వేదింపులు తట్టుకోలేక రామకృష్ణ రోజు వారిగానే కళాశాలకు వచ్చేటప్పుడు పుస్తకాలతో పాటుగా పురుగుల మందు తీసుకొని వచ్చాడు. కళాశాల ప్రారంభం కాగానే కొద్ది సేపటికి పురుగుల మందు తాగడంతో తోటి విద్యార్థులు గమనించి చికిత్స నిమిత్తం హూజర్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని వెంటనే కళాశాల నిర్వాహకులు బాధితుని తల్లిదండ్రులకు తెలియజేశారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలిసింది. మండిపడుతున్న విద్యార్థులు జరిగిన సంఘటన నేపథ్యంలో కళాశాల యాజమాన్యంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారని, ఎవరైనా చెల్లించకపోతే వేదించడమే కాకుండా బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి కళాశాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
భార్యను కడతేర్చిన భర్త
చిలుకూరు : అనుమానం పెనుభూతమైంది. కల కాలం తోడునీడగా ఉంటూ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్తే కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఆదివారం చిలుకూరులో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకా రం..చిలుకూరుకు చెందిన దుగ్గెబోయిన శ్రీను అదే గ్రామంలో ఉంటున్న తన అక్క బిడ్డ వెంకటమ్మను (38) వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా కూతురు నాలుగేళ్ల క్రితం మృతి చెందింది. కుమారుడికి ఏడాది క్రితం వివాహం చేశారు. స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న శ్రీను.. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. అంతేకాకుండా భార్యను అనుమానిస్తుండేవాడు. ఈ క్రమంలో శనివా రం రాత్రి 10 గంటల సమయంలో భార్యతో ఘర్షణ పడ్డాడు. ఆ తర్వాత గొడవ సద్దుమనగడంతో నిద్రకు ఉపక్రమించారు. పక్క గదిలో కుమారుడు నిద్రపోయాడు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో శ్రీను మేల్కొని నిద్రపోతున్న అతని భార్య వెంకటమ్మ మెడపై ఇంట్లో ఉన్న కత్తితో రెండు చోట్ల నరికాడు. దీంతో వెంకటమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కాసేపటికి నిద్రలేచిన కుమారుడు తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించాడు. అప్పటికే అతని తండ్రి శ్రీను పరారయ్యాడు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేయడంతో పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలిని సందర్శించిన పోలీసులు హత్య జరిగిన ప్రదేశాన్ని కోదాడ సీఐ మెగిలయ్య, ఎస్ఐ రామాంజనేయులు సందర్శించారు. సంఘటన స్థలంలో ఉన్న కత్తిని, రక్తం మరకలను పరిశీలించారు. మృతురాలి కుమారుడు సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. పరారీలో ఉన్న నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ తెలిపారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
చిలుకూరు : ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించాలని కోరుతూ యువతి ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఆపై న్యాయం చేయాలని కోరుతూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. మండలంలోని దుదియాతండాకు చెందిన బాణావత్ దేవిక, అదే గ్రామానికి చెందిన భూక్యా శ్రీకాంత్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను దేవిక తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ ఏడాది జూన్ నెలలో దేవికకు వేరేవ్యక్తితో వివాహం జరిపించారు. అయితే అప్పటి నుంచి శ్రీకాంత్ మళ్లీ వివాహం చేసుకుంటానని దేవికను వేధించసాగాడు. పెళ్లిచేసుకోకపోతే చనిపోతానని బెదిరించాడు. అతడి మాటలను నమ్మి దేవిక తన భర్తకు విడాకులు ఇచ్చింది. తీరా వివాహం చేసుకోవాలని అడిగితే తమ తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదంటూ శ్రీకాంత్ ముఖం చాటేశాడు. గ్రామంలో ఉద్రిక్తత శ్రీకాంత్ ఇంటి ఎదుట దేవిక ధర్నాకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావారణం చోటు చేసుకుంది. శ్రీకాంత్ తల్లిదండ్రులు దేవికతో ఘర్షణ పడి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
పోరు బిడ్డ.. మన దొడ్డా
చిలుకూరులో ఏర్పాటుచేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య కాంస్య విగ్రహాన్ని ఆది వారం ఆవిష్కరించారు. నర్సయ్య పేదల పక్షాన నిలబడి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వక్తలు కొనియాడారు. చిలుకూరు, న్యూస్‌లైన్: తెలంగాణ సాయుధ పోరాటానికి పురిటిగడ్డగా నిలిచిన నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ తరఫున నిలిచి దొడ్డా నర్సయ్య పోరుబిడ్డగా నిలిచారని మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు కొనియాడారు. నాడు భూస్వామ్య, జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన పాత్ర ఎనలేనిదన్నారు. మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు దొడ్డా నర్సయ్య 15 వ వర్ధంతి సందర్భంగా చిలుకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఎందరో కమ్యూనిస్టు నాయకులను తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పేదల పక్షాన నిల బడి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచాడని అన్నారు. అంతటి మహనీయుడిని ప్రతి కయ్యూనిస్టు ఆదర్శంగా తీసుకొని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి తరానికి దొడ్డా నర్సయ్య ఆదర్శప్రాయుడని రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నేటి వరకూ కమ్యూనిస్టు పార్టీ జిల్లాలో బలంగా ఉన్నదంటే దొడ్డా నర్సయ్య లాంటి నేతల ఉద్యమ ఫలితమేనన్నా రు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీకి అనాడు ఎంతో స్ఫూర్తినిచ్చి పేదల కోసం పరితపించిన డీఎన్ (దొడ్డా నర్సయ్య), బీఎన్‌లు స్టెన్‌గన్ లాంటివారని అన్నారు. ముందుగా సీపీఐ జెండాను, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా సీపీఐ నల్లగొండ, కృష్ణా జిల్లాల కార్యదర్శులు మల్లేపల్లి ఆదిరెడ్డి, అక్కినేని వనజ, సీపీఎం జిల్లా కార్యదర్శి నం ద్యాల నరసింహారెడ్డి, సీపీఐ విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి చలసాని రాఘవేందర్రావు, నల్లగొండ జిల్లా మాజీ కార్యదర్శి దొడ్డా నారాయణరావు, వివి ద పార్టీల నాయకులు బద్దం బద్రారెడ్డి, గన్నా చంద్రశేఖర్, ఉప్పల కాంతారెడ్డి, నంద్యాల రామిరెడ్డి, రత్నాకర్‌రావు, పశ్య పద్మ, ముత్తవరపు పాండు రంగారావు, కేవీఎల్, పోటు ప్రసాద్, కొండా కోటయ్య, దొడ్డా పద్మా, పుట్టపాక శ్రీని వాస్ యాదవ్, మేకల శ్రీను, బెజవాడ వెంకటేశ్వర్లు, బజ్జూరి వెంకట్ రెడ్డి, వివిద పార్టీల నాయకులు చింతకుంట్లు లక్ష్మినారాయణరెడ్డి, వాడపల్లి వెంకటేశ్వర్లు, డేగబాబు, కందిబండ సత్యం, పాలకూరి బాబు, ధనుంజయనాయుడు, కంబాల శ్రీను పాల్గొన్నారు. తల్లి మరణవార్తతో వెనుదిరిగిన కె.నారాయణ దొడ్డా నర్సయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయ ణ మాతృమూర్తి మరణవార్తతో మార్గమధ్యం నుంచే వెనుదిరిగి వెళ్లిపోయా రు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన జిల్లాలోని నార్కట్‌పల్లి వద్దకు చేరుకోగానే తల్లి మరణవార్త తెలి సింది. దీంతో ఆయన హాజరు కాలేకపోయారు. -
గ్రామ కార్యదర్శులకు మరిన్ని అధికారాలు
చిలుకూరు, న్యూస్‌లైన్: గ్రామపంచాయతీ పాలనను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మూడు నెలలకోసారి గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సభలకు హాజరుకాని మండలస్థాయి అధికారులపై నివేదిక పంపేలా గ్రామకార్యదర్శులకు మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. ఈ మేరకు జీఓ నంబర్ 791ని జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 1165 పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా గ్రామాలకు పాలకవర్గాలు కూడా వచ్చాయి. అయితే గతంలో గ్రామసభలు మొక్కుబడిగా నిర్వహించేవారు. దీనివల్ల ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరిగేది కాదు. దీంతో పంచాయతీల పాలన సజావుగా కొనసాగేలా చూడడమే గాక గ్రామంలో నెల కొన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారిం చింది. ఈ నేపథ్యంలో గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుం టోంది. అందులో భాగంగానే పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయి అధికారాలు కట్టబెడుతూ జీఓ నంబర్791ని విడుదల చేసింది. పరిష్కారం కానున్న సమస్యలు గతంలో గ్రామ సభలకు మండల స్థాయి అధికారులు రాకపోయినా గ్రామ కార్యదర్శులు వాటిని నిర్వహించేవారు. దీంతో గ్రామాల్లో ప్రధానంగా తాగునీరు, డ్రెయినేజీ తదితర సమస్యలు పరిష్కారంగాక దీర్ఘకాలికంగా ఉండేవి. అలాగే ఏయే అధికారులు గ్రామసభలకు హాజరైన విషయం కూడా ఉన్నతాధికారులకు తెలిసేదికాదు. కానీ ఈ జీఓ ప్రకారం.. ఏడాదిలో నాలుగు పర్యాయాలు నిర్వహించే గ్రామ సభలకు ప్రధాన శాఖల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో గ్రామాల్లో నెలకొన్న దీర్ఘ కాలిక సమస్యలను గ్రామ ప్రజలు మండల స్థాయి అధికారులు దృష్టికి తీసుకెళ్లడం ద్వారా అవి పరిష్కారమయ్యే అవకాశం చాలావరకు ఉంది. జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక గ్రామ సభలకు రాని మండల స్థాయి అధికారులపై ఆయా గ్రామాల కార్యదర్శులు జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆయా గ్రామాల కార్యదర్శులు గ్రామసభలను తూతూ మంత్రంగా నిర్వహించినా పెద్దగా పట్టించుకున్న వారు లేరు. కానీ ఈ జీఓ ప్రకారం గ్రామ సభలను పక్కాగా మండల స్థాయి అధికారుల పర్యవేక్షణలో నిర్వహించాల్సి ఉంటుంది. వేధిస్తున్న కార్యదర్శుల కొరత ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల కొరత వేధిస్తోంది. ఒక్కో కార్యదర్శి ఇప్పటికే రెండు నుంచి మూడు గ్రామపంచాయతీలకు ఒక ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ జీఓతో కార్యదర్శులకు మరింత భారంగా మారనుంది. గ్రామ సభలకు రాని మండలస్థాయి అధికారులపై తాము ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వాలని గ్రామ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. తమకు చిక్కులు తప్పవని వారు పేర్కొంటున్నారు.