నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ | free coaching for unemployees in chilkur | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ

Published Sat, Aug 29 2015 7:22 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

free coaching for unemployees in chilkur

మొయినాబాద్: రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డెరైక్టర్ డి.కృష్ణ తెలిపారు. మెయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో ఉన్న ఎస్‌బీహెచ్ ఆర్‌సెటీ కేంద్రంలో ఈనెల 31 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. కంప్యూటర్ బేసిక్స్ (30 రోజులు), బేసింగ్ ఫొటోగ్రాఫీ అండ్ వీడియోగ్రాఫీ (21 రోజులు), కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ బేసిక్ నెట్వర్కింగ్ (45 రోజులు) కోర్సుల్లో శిక్షణలు ఇస్తామన్నారు.

18 - 45 ఏళ్ల మధ్య వయసు కలిగి పదోతరగతి.. ఆపై చదివినవారు అర్హులని, ఆసక్తి ఉన్నవారు వెంటనే చిలుకూరు ప్రాంగణంలోని ఆర్‌సెటీ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9000778300, 9985318452, 9866689089 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement