
హైదరాబాద్: కొందరు చేసిన సోషల్ మీడియా ప్రచారం చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని జన దిగ్భందనం చేసింది

ప్రస్తుతం చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా పిల్లలు లేని తల్లితండ్రులకు ప్రత్యేకంగా గరుడ ప్రసాదం ఇస్తారని నిన్న(గురువారం) సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

ఆలయ అధికారులు కానీ, పూజారులు కానీ ప్రత్యక్షంగా చేయకున్నా.. దీన్ని ఎవరూ ఖండించలేదు.

దీంతో నేడు ఉదయం 5గంటల నుంచే భారీగా భక్తులు పోటెత్తడంతో చిలుకూరు ఏరియా మొత్తం స్తంభించిపోయింది.

సిటీతోపాటు చుట్టుపక్కల నుంచి చిలుకురూరుకు భక్తులు క్యూ కట్టారు. మాసబ్‌ట్యాంక్ నుంచి మెహదీపట్నం, లంగర్‌హౌస్, సన్‌సిటీ, కాళీమందిర్ అప్పా జంక్షన్ మీదుగా హిమాయత్ సాగర్ వరకు ట్రాఫిక్ జాం ఏర్పడింది.గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయింది









