Chilkur balaji temple
-
చిలుకూరు ఆలయంపై తప్పుడు ప్రచారం
-
సంతానాన్ని కలిగించే ప్రసాదం..ఎగబడ్డ జనం..
-
గరుడ ప్రసాదం.. పోటెత్తిన జనం.. ట్రాఫిక్ నరకం (ఫొటోలు)
-
గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు.. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)
-
Hyd : చిలుకూరి టెంపుల్‌కు జనం ఎందుకు పోటెత్తారంటే?
సాక్షి, హైదరాబాద్: కొందరు చేసిన సోషల్ మీడియా ప్రచారం చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని జన దిగ్భందనం చేసింది. ప్రస్తుతం చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా పిల్లలు లేని తల్లితండ్రులకు ప్రత్యేకంగా గరుడ ప్రసాదం ఇస్తారని నిన్న(గురువారం) సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆలయ అధికారులు కానీ, పూజారులు కానీ ప్రత్యక్షంగా చేయకున్నా.. దీన్ని ఎవరూ ఖండించలేదు. దీంతో నేడు ఉదయం 5గంటల నుంచే భారీగా భక్తులు పోటెత్తడంతో చిలుకూరు ఏరియా మొత్తం స్తంభించిపోయింది. సిటీతోపాటు చుట్టుపక్కల నుంచి చిలుకురూరుకు భక్తులు క్యూ కట్టారు. మాసబ్‌ట్యాంక్ నుంచి మెహదీపట్నం, లంగర్‌హౌస్, సన్‌సిటీ, కాళీమందిర్ అప్పా జంక్షన్ మీదుగా హిమాయత్ సాగర్ వరకు ట్రాఫిక్ జాం ఏర్పడింది.గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయింది. రంగారెడ్డి జిల్లా తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి చిలుకూరు ఆలయానికి 50 వేల మందికిపైగా జనాలు చేరుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇంకా వస్తూనే ఉన్నారని తెలిపారు. ఆలయం వద్ద గరుడ ప్రసాదం ఇస్తున్నారన్న విషయం తెలిసి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణికులు రావొద్దని కోరారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో ఉన్న బాలాజీ దేవాలయానికి వీసా దేవుడని పేరు. సాధారణంగానే భారీగా భక్తులు వస్తారు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు.. పైగా ప్రసాదం ప్రచారంతో భక్తులు పోటెత్తారు. ఏకంగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 12 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాజేంద్రనగర్‌లోని కాళీమాత టెంపుల్ నుంచి చిలుకూరు టెంపుల్ వరకు ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ రూటులో బోలెడు ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. అలాగే కొన్నిసంస్థలున్నాయి. ట్రాఫిక్‌జాంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిలుకూరు ట్రాఫిక్ జాం : గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Chilkur: చిలుకూరులో 1000 ఏళ్ల నాటి శివాలయం..
సాక్షి, హైదరాబాద్: చిలుకూరు అనగానే అందరికీ బాలాజీ దేవాలయం గుర్తుకొస్తుంది. హైదరాబాద్ నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. అమెరికా వెళ్లాలనుకునే యువత ప్రదక్షిణలతో నిత్యం ఈ ఆలయం రద్దీగా ఉంటుంది. వీసా బాలాజీ అంటూ వారు పిలుచుకుంటుంటారు. చిలుకూరు బాలాజీ దేవాలయం చేరువలోనే మరో అత్యంత పురాతన శివాలయం ఉందని, ఈ ప్రాంతాన్ని పాలించిన రాష్ట్రకూటుల కాలం నాటిదని తాజాగా చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. స్థానికులు దానికి సున్నం వేసి పూజాదికాలు నిర్వహిస్తున్నప్పటికీ, అది బాగా శిథిలావస్థకు చేరుకుంది. తాజాగా శివనాగిరెడ్డి ‘ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీ’కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని చారిత్రక ఆనవాళ్లపై పరిశోధించారు. ఈ సందర్భంగా ఈ శివాలయాన్ని పరిశీలించి, నిర్మాణ శైలి, అందులోని విగ్రహాల శైలి ఆధారంగా అది వెయ్యేళ్ల క్రితంనాటిదని తేల్చారు. ఆలయ అధిష్టానం ఇప్పటికే భూమిలోకి కూరుకుపోయిందని, ఆలయ రాళ్ల మధ్య పగుళ్లేర్పడి విచ్చుకుపోతున్నాయని, శిఖరభాగంలోని రాళ్లు దొర్లిపోతున్నాయని పేర్కొన్నారు. 9–10 శతాబ్దాల్లో నిర్మించిన ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు. జైన బసదిగా విలసిల్లిన గ్రామం వేములవాడ చాళుక్యుల కాలంలో ఈ గ్రామం జైన బసదిగా విలసిల్లిందని, ఇక్కడ అద్భుత జైన నిర్మాణాలుండేవని, ఇక్కడి కొన్ని శిల్పాలు ప్రస్తుతం గోల్కొండలోని ఖజానా బిల్డింగ్ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయని, ఇప్పటికీ గ్రామంలోని చాలా ప్రాంతాల్లో జైన శిల్పాలు కనిపిస్తున్నాయని శివనాగిరెడ్డి చెప్పారు. రాష్ట్రకూటుల శైలి శివాలయం పక్కన కూడా జైన శిల్పముందన్నారు. గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న భైరవ, వీరుల, నాగదేవత, భక్తురాలి శిల్పాలను సరిగ్గా ప్రతిష్టించాలని, చెరువుకట్ట వద్ద ఉన్న పురాతన మండపాన్ని కూడా పునరుద్ధరించాలని సూచించారు. చదవండి: మినరల్ వాటర్.. మిల్లెట్ భోజనం! -
‘ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పది’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని చిలుకూరి బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు రంగరాజన్ సమర్ధించారు. ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తిరుమలతో పాటు ప్రధాన ఆలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పదన్నారు. ఇక శ్రీరామ నవమికి ఈ ఏడాది భక్తులు తమ గుండెళ్లో కొలుచుకోవాలన్నారు. వచ్చే ఏడాది శ్రీరామనవమి నాడు రెట్టింపు ఉత్సాహంతో ఉత్సవాలు నిర్వహించుకుందామని ఆయన భక్తులకు సూచించారు. అదేవిధంగా చిలుకూరు ఆలయంలో భక్తుల దర్శనం నిలిపివేయడం తనకు బాధగానే ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రధాన అర్చకులు రంగారాజన్ తెలిపారు. -
నేటి నుంచి చిలుకూరు ఆలయం బంద్
మొయినాబాద్ (చేవెళ్ల): తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయంపై కోవిడ్ వైరస్ ప్రభావం పడింది. ఈ నెల 19 నుంచి 25 వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకుడు రంగరాజన్ బుధవారం ప్రకటించారు. కోవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి రోజూ చిలుకూరు బాలాజీ దేవాలయానికి భక్తులు బాగానే వస్తున్నారని ఆయన చెప్పారు. బాలాజీ ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తూ ఎక్కువ సమయం ఉంటున్నారని, దీని వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. కొంత మంది భక్తులు విదేశాల నుంచి నేరుగా ఆలయానికి వచ్చి ప్రదక్షిణలు చేస్తుంటారని అలాంటి వారిని ప్రత్యేకంగా గుర్తించలేమని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. రోజు మాదిరిగా నిత్యం స్వామివారికి అభిషేకం, పూజలు, అర్చన, ఆరాధన జరుగుతాయని.. కానీ భక్తులకు మాత్రం స్వామివారి దర్శనం ఉండదని తెలిపారు. -
ప్రియాంక హత్య: చిలుకూరు ఆలయం మూసివేత
మొయినాబాద్ (చేవెళ్ల): వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణహత్యకు నిరసనగా శనివారం రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని మూసివేశారు. ఉదయం 11 గంటల నుంచి 20 నిమిషాలపాటు ప్రదక్షణలు, దర్శనాలు పూర్తిగా నిలిపివేసి ఆలయాన్ని మూసివేశారు. అనంతరం ఆలయం ఎదుట భక్తులతో మహాప్రదక్షణ చేయించారు. ‘రక్షిద్దాం.. రక్షిద్దాం.. స్త్రీజాతిని రక్షిద్దాం’అంటూ భక్తులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ మహాప్రదక్షణ నిర్వహించారు. స్త్రీలకు రక్షణ కల్పించాలంటూ మొక్కతున్న భక్తులు ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు రంగరాజన్ మాట్లాడుతూ.. ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. 9 నెలల పాప నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు రక్షణ లేకుండాపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలు సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకులు కన్నయ్య, మురళీ తదితరులు పాల్గొన్నారు. -
బతుకునిచ్చే పూలదేవత
సాక్షి, మొయినాబాద్(చేవెళ్ల): ‘బతుకమ్మ అంటే పూల పండుగ.. ప్రకృతి పూలను అందంగా అలంకరించి పూజించే దేవత బతుకమ్మ. విగ్రహం లేకుండా పూజలందుకునే పూల దేవత. ఈమహోత్సవం సామాజిక సందేశం అందిస్తుందంటు’న్నారు చిలుకూరు బాలాజీ దేవాలయం మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందరరాజన్ మాటల్లోనే బతుకమ్మ విశిష్టతను తెలుసుకుందాం. శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా.. అంటూ సాగే బతుకమ్మ పాట ప్రసిద్ధమైనది. బతుకమ్మ సర్వదేవతాస్వరూపం. లక్ష్మీ, పార్వతీ, సరస్వతీ దేవీలు బతుకమ్మ స్వరూపంగా భావించి తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మను ఆరాధిస్తారు. సంపద, ధనం, ధాన్యం, సంతానం, సౌభాగ్యం, వైభవం, విద్య సంపదలను ఇవ్వాలని గౌరమ్మ రూపంలో కొలుస్తారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో అనేక పండుగలు, పర్వాలు జరుగుతాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగంగా కొద్దిపాటి తేడాతో పండుగలు నిర్వహిస్తారు. కానీ తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే బతుకమ్మ పండుగ మాత్రం ఈ ప్రాంత ఆత్మను ప్రకటిస్తుంది. జనసామాన్యంలో నుంచి ఏర్పడ్డ విశ్వాసంతో పుట్టిన పండుగ బతుకమ్మ. బతుకమ్మకు జీవించు–బతికించు అని అర్థం. అదే తెలంగాణ సంస్కృతిలో ఆయువుపట్టుగా నిలిచింది. అన్యోన్య అనురాగం, ప్రేమించేతత్వం తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉందంటే దానికి మూలం బతకమ్మలో కనిపిస్తుంది. బతుకమ్మ పండుగకు గొప్ప చారిత్రక ఆధారం కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతాన్ని కాకతీయులు గొప్పగా పాలించారు. కాకతీయ రాజ్యపాలకుడైన ‘గుండన’ పాలనలో పొలం దున్నతుండగా గుమ్మడితోటలో ఓ స్త్రీదేవతా విగ్రహం లభించింది. గుమ్మడిని సంస్కృతంలో కాకతి అని పిలుస్తారు. గుమ్మడితోటలో లభించినందువల్ల కాకతమ్మ అనే పేరుతో రాజులు ఆమెను పూజించారు. రాజులతోపాటు ప్రాంత ప్రజలు కూడా పూజించేవారు. రానురాను విగ్రహం కన్నా విగ్రహం ముందు పూలకుప్పలు పోసి వాటిని పూజించడం మొదలు పెట్టారు. పూలకుప్పలే దేవతా స్వరూపంగా మారిపోయింది. కాకతమ్మ అనే శబ్ధం క్రమంగా భాషాశాస్త్రపరంగా ఉచ్చరణలో బతుకమ్మ పేరుగా మారినట్లు పరిశోధకులు డాక్టర్ కసిరెడ్డి తెలియజేశారు. బతుకమ్మలో సామాజిక సందేశం పూలతో ఆరాధించే బతుకమ్మకు ఎలాంటి విగ్రహం లేదు. ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలను ఒక్కచోట పేర్చి బతుకమ్మగా అలంకరిస్తారు. ఏ జీవి అయినా మట్టిలో నుంచి పుట్టి చివరకు మట్టిలోనే కలిసిపోతుందనే సామాజిక సందేశం బతుకమ్మలో కనిపిస్తుంది. మట్టి నుంచి పుట్టిన చెట్టు. ఆ చెట్ల నుంచి వచ్చే పూలు, పూలతో తయారైన బతుకమ్మ నీటిలో కలిసిపోయి మళ్లీ మట్టిగా మారుతుంది. అలాగే జీవులన్నీ ఎక్కడి నుంచి పుట్టినా భోగాలు అనుభవించి చివరకు మళ్లీ మట్టిలోనే కలుస్తాయనే ఆధ్యాత్మిక, తాత్విక సందేశాన్ని బతుకమ్మ పండుగ ఇస్తుంది. -
కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు
సాక్షి, మొయినాబాద్: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చిలుకూరు బాలాజీ దేవాలయంలో మొక్కు చెల్లించుకున్నారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం బాలాజీ దేవాలయానికి వచ్చిన ఆయన ఆలయ గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షణలు చేశారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతం కావడంతోపాటు చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన చిలుకూరులో 108 ప్రదక్షిణలు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆయనతోపాటు 108 ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో సుందరేశ్వరస్వామికి అభిషేకం నిర్వహించారు. మంత్రి రాకతో ఆలయ ప్రాంగణంలో రాజకీయ నాయకుల సందడి నెలకొంది. కార్యక్రమంలో చిలుకూరు సర్పంచ్ గునుగుర్తి స్వరూర, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జీటీఆర్ మండల అధ్యక్షుడు దేవరంపల్లి మహేందర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొంపల్లి అనంతరెడ్డి, ఎంపీటీసీ రవీందర్, మాజీ ఎంపీటీసీ గుండు గోపాల్, మాజీ సర్పంచ్ పురాణం వీరభద్రస్వామి, మాజీ ఉపసర్పంచ్ ఆండ్రూ, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, ఏఎంసీ వైస్ చైర్మన్ దారెడ్డి వెంకట్‌రెడ్డి, చిన్నమంగళారం సర్పంచ్ సుకన్య, నాయకులు హరిశంకర్ గౌడ్, విష్ణుగౌడ్, రవియాదవ్, రాఘవేందర్ యాదవ్, గడ్డం అంజిరెడ్డి, చెన్నయ్య ఉన్నారు. -
‘లోకేశ్‌ను ఎలా మంత్రిని చేశారు’
మొయినాబాద్(చేవెళ్ల): ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు ఏ అర్హత ఉందని మంత్రిని చేశారని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులును తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. టీటీడీ పాలకమండలికి చట్టాలపై అవగాహన లేదన్నారు. తిరుమలపై ఏ నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభావం చిన్న ఆలయాలపై పడుతుందన్న విషయాన్ని టీటీడీ గుర్తించాలన్నారు. ఎండోమెంట్ యాక్ట్‌ని సవరించ కుండా రిటైర్మెంట్ చేయడానికి వీలులేదని, ధార్మిక పరిషత్ ఇచ్చిన రిజల్యూషన్ ను ట్రస్టు బోర్డు కొట్టేయడానికి వీలులేదన్నారు. వంశ పారంపర్యంగా తండ్రి తరువాత కొడుకు అర్చకత్వం నిర్వహించవద్దని చెబుతున్న చంద్రబాబు ఆయన కుమారుడిని మాత్రం వారసత్వంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చారని మండి పడ్డారు. ‘అర్చక వ్యవహారాల్లో మీరు వేలు పెట్టారు కాబట్టి మేం మిమ్మల్ని ప్రశ్నలడుగుతాం. మీకు రాజకీయమెందుకని అడుగుతాం.. రాజకీయ నాయకుడు మా దగ్గరకొస్తే మేం రాజకీయ నాయకుడి దగ్గరకొస్తాం’ అని బాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. -
వైఎస్సార్‌కు రుణపడి ఉంటాం
-
బాబు ప్రభుత్వం పోవాలని ప్రదక్షిణలు చేశారు
సాక్షి, హైదరాబాద్ : సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అర్చకత్వం ప్రాథమిక హక్కు అని చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకులు, తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ సీఎస్ రంగరాజన్ అన్నారు. ఆలయాలకు ఉన్న ఈవోలు మారొచ్చు కానీ అర్చకుడు మారడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఆగమం ప్రకారం ఆలయ ప్రతిష్ట జరిగినప్పుడు అర్చకుడిని నియమించుకుంటారని తెలిపారు. 1996లో చంద్రాబాబు సీఎంగా ఉన్న సమయంలో అర్చకులపై సుప్రీం కోర్టు తీర్పు అమలు చేయలేదని అన్నారు. కానీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1987 పద్దతిని సవరించి అర్చకులను ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆ మహానేతకు తాము ఎప్పుడు రుణపడి ఉంటామని తెలిపారు. 2003లో చిలకూరులో ప్రతి ఒక్క భక్తుడు చంద్రబాబు ప్రభుత్వం పోవాలని, వైఎస్సార్ రావాలని ఒక ప్రదక్షిణ అదనంగా చేశారని రంగ రాజన్ పేర్కొన్నారు. వారి పరిస్థితి దయనీయం : టీటీడీ తీసుకున్న నిర్ణయం కారణంగా చిన్న ఆలయాల అర్చకుల పరిస్థితి దయనీయమౌతుందని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ధార్మిక పరిషత్ ఆమోదం లేనిదే అర్చకులను మార్చకూడదని అన్నారు. ధార్మిక పరిషత్ ఏర్పాటులో రాష్ట్రం ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తోందని ప్రశ్నించారు. కనీసం చర్చించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. -
'టీటీడీ ఆదాయంలో తెలంగాణ వాటా ఇప్పించండి'
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయంలో తెలంగాణ వాటా కోసం ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీటీడీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పించాలంటూ చిలుకూరు బాలజీ ఆలయ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలు వాయిదా వేసింది. -
భక్తుల తాకిడి
చిలుకూరులో.. కలియుగ దైవం... భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సెలవు రోజు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామివారి దర్శనంకోసం ఉదయం 6 గంటల నుంచే క్యూకట్టారు. 8 గంటల నుంచి రద్దీ పెరగడంతో గర్భగుడి దర్శనాలు నిలిపివేసి మహాద్వార దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులు 11, 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో సుందరేశ్వరస్వామికిప్రత్యేక పూజలు నిర్వహించారు. -మొయినాబాద్ చీర్యాలలో.. చీర్యాల లక్ష్మీనృసింహస్వామి దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునేందుకు నగరం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సత్యనారాయణస్వామి వ్రతాలు, సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. ప్రసాదాల కొరత రాకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ మల్లాపు లక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. - కీసర -
చిలుకూరులో భక్తుల సందడి
మొయినాబాద్ : తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. రెండవ శనివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో 108 ప్రదక్షిణలు నిలిపివేసి కేవలం 11 ప్రదక్షిణలకు మాత్రమే అనుమతించారు. స్వామివారిని దర్శించుకునేందుకు రెండు వరుసల్లో మహాద్వార దర్శనం ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. -
భగవంతుడు కరుణామయుడు
ఆపదనుంచి కాపాడటమైనా, విజయాలు సమకూర్చడమైనా భగవంతుడు మనపట్ల మమకారంతో చేస్తాడు. ఆయన కరుణాకటాక్షాలు అటువంటివి. ఒకరోజు పొద్దుటే భక్తుడొకరు తలపై గాయంతో గుడికి వచ్చాడు. గాయం ఇంకా ఆరలేదు కాబోలు కట్టు నెత్తురోడుతూనే ఉంది. నా దగ్గరకొచ్చి ‘స్వామీ! ఆ దేవుడు నన్ను శిక్షించాడా?’ అని అడిగాడు. ‘లేదు. నీకు తగలవలసిన పెద్ద గాయాన్ని చిన్నది చేశాడు’ అని చెప్పాను. నా మాటలు బహుశా ఆయనకు సందేహ నివృత్తి చేయలేకపోయాయి. తర్వాత వచ్చాడు. ‘అయ్యా! సరిగ్గా మీరు చెప్పినట్టే జరిగింది’ అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయన అడిగినదేమిటో, నేను చెప్పినదేమిటో మరిచిపోయాను. పెద్దవాడినయ్యాను కదా! అందుకే ‘ఏమి జరిగిందని?’ అడిగాను. ‘స్వామీ! నేను కారులో తిరిగి వెళ్తుండగా నా కారు టిప్పరును ఢీకొట్టింది. కారునుండి నేను పక్కకు పడిపోయాను. కారుకు జరిగిన నష్టం చూసిన వారెవరైనా డ్రైవర్ మరణించివుంటాడనే అనుకుంటారు. కానీ, నాకు చిన్న గాయం కూడా కాలేదు. ఈ ఘటన మైకులో చెప్పండి. నన్ను భగవంతుడే కాపాడాడు’ అని ఎంతో ఉద్వేగంతో అన్నాడు. భగవంతుడు మనిషి తలరాతను మార్చడు. కానీ, ఆయన కరుణాకటాక్షాలవలన దుర్ఘటన తీవ్రతను తగ్గించగలడు. ఎంసెట్ ఫలితాలు వచ్చాయి. ప్రతివారూ తమ విజయం వెనక కోచింగు సెంటర్ల ప్రోద్బలం గురించి, తల్లిదండ్రుల ప్రోత్సాహం గురించి ఏకరువుపెట్టారే తప్ప భగవంతుని ఆశీర్వచనాల గురించి ఎవరూ చెప్పలేదు. మరుసటి రోజు చిలుకూరుకు వచ్చిన విద్యార్థిని తనకు మెడిసిన్‌లో 6వ ర్యాంకు వచ్చిందని ఎంతో ఆనందంగా తెలిపింది. టీవీ ఇంటర్వ్యూలో భగవంతునికి ధన్యవాదాలు ఎందుకు చెప్పలేదని అడిగాను. ఆ అమ్మాయి మౌనంగా ఉండిపోయింది. ‘చిలుకూరు బాలాజీ వలన ర్యాంకు వచ్చిందని చెప్పకున్నా కనీసం ఆ భగవంతుని ఆశీర్వాదంవల్ల విజయం సాధించానని చెప్పవలసింది’ అన్నాను. మన విజయాలకు అతనిని కర్తగా చేస్తే, మన అపజయాలను ఆయన భరిస్తాడు. ‘కర్మణ్యే వాధికారస్తే....’ సంవత్సరాంత పరీక్షలు దగ్గరకొచ్చాయి. ఎందరెందరో విద్యార్థులు హాల్ టికెట్లు తెచ్చి, చిలుకూరు బాలాజీ ముందు పెట్టి తీసుకువెళ్తారు. అక్కడికి వచ్చే తల్లిదండ్రులకు మేము ఒకటే చెబుతాము.... ‘ఏ పరీక్ష అయినా జీవన్మరణ సమస్య కాదు. అందులో మార్కులు సాధించనివారికి బతుకులేదని కాదు. పరీక్షల గురించి పిల్లలను భయపెట్టవద్దు. అది వారి ఆలోచనాశక్తిని ఆటంకపరుస్తుంది’. అలాగే, పిల్లలకు కూడా నేను చెప్పేదొక్కటే.... ‘మీరు బాధ్యతాయుతంగా, శ్రద్ధగా చదవండి. చక్కగా పరీక్షలు రాయండి. ఫలితాన్ని భగవంతుడికి వదిలేయండి’ కృషి చేయడం మాత్రం మన కర్తవ్యం. ఫలితంపై మనకు హక్కు లేదు. మన కృషికి తగ్గ ఫలితం భగవంతుడు తప్పక ఇస్తాడు. - సౌందర్‌రాజన్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు -
పచ్చనిచెట్టూ ప్రత్యక్షదైవమే!
వృక్షాల విశిష్టతను మన పురాణాలు చాటాయి. వృక్షాల ప్రాముఖ్యం, పరిరక్షణ గురించి పిల్లలకు బోధించాలి. కానీ, అది మనం చెయ్యం. రెండు సంఘటనలు ప్రస్తావిస్తాను. 2009లో చిలుకూరు బాలాజీ ఆలయంలో ధ్వజస్తంభాన్ని మార్చవలసి వచ్చింది. కావలసిన చెక్కను ఒక పొడవాటి చెట్టునుండి తీసుకుని, వేదమంత్రో చ్ఛారణల మధ్య ప్రతిష్ట చేస్తారు. అందుకు అనువైన చెట్టును నిర్ణయించడమే అన్నిటి కన్నా ముఖ్యం. అనుమతి కోసం అటవీ శాఖకు దరఖాస్తు చేసుకున్నప్పుడు వారు అంగీకరించి, అనువైన చెట్టు ఆదిలాబాద్‌లో ఉన్నదని చెప్పారు. ఆ చెట్టు పొడవు 100 అడుగులు. నరికిన తర్వాత దాని పొడవు 40 అడుగులు. ప్రతిష్ట తర్వాత పొడవు దాదాపు 31 అడుగులు. ఆగమ శాస్త్రాల ప్రకారం ఏదైనా చెట్టు నరికితే, పరి హారంగా 1,000 మొక్కలను నాటాలి. ధ్వజస్తంభ ప్రతిష్టానంతరం దానికి ఇత్తడి కవచం వేసి అలంకారం చేశాక ప్రకృతికి నష్టపరిహారం ఎలా చేయాలా అని ఆలోచించాము. గుడికి వచ్చే భక్తులలో ఒక సాఫ్ట్వేర్ సంస్థలో పని చేసే యువకుడికి అపూర్వమైన ఆలోచన కలిగింది. వారి బృందం ఆధ్వర్యంలో నడు స్తున్న ‘స్క్విరిల్స్’ పేరిట స్వచ్ఛందంగా ప్రతి వారాంతంలో 108 మొక్కలను చిలుకూ రులో అందరికీ పంచారు. వారాంతంలో గుడి ఆవరణ పచ్చటి మొక్కలతో కళకళలాడేది. వేప, మామిడి, జామ వంటి మొక్కలను ప్రతి శనివారం ఉదయం పొద్దుట 10.30కు యువకులు భక్తులకు పంచేవారు. భక్తులు ప్రసాదంలా ఇళ్లకు తీసుకెళ్లి నాటుకునేవారు. చిన్నారులు చిట్టి చేతులతో మొక్కలు పట్టుకుని ప్రదక్షిణలు చేస్తుంటే కనువిందుగా అనిపించేది, ఆ మొక్కలే దేవునికి ప్రదక్షిణ చేస్తున్నట్టు. ఎందరెందరో భక్తులకు ఈ ఆలోచన నచ్చి, తమ పిల్లల పుట్టిన రోజుకు వచ్చినవారికి ఇలా మొక్కలను బహు మతిగా ఇస్తున్నామని చెప్పారు. ఎంత బాగుంది! ఒకరోజు ఓ మధ్యవయస్కుడు వచ్చి నా దగ్గర గోడు వెళ్లబోసుకున్నాడు. వ్యాపారం నష్టాల్లో ఉందట. అప్పులు తీర్చాలని బ్యాంకులు నోటీసులు జారీచేశాయట. వాస్తు శాస్త్ర నిపుణుని వద్దకు వెళ్తే ఆయన ఇంటికొచ్చి చూసి, ముందున్న రావిచెట్టు వల్లనే సమస్యలొస్తున్నాయని చెప్పా రట. రహదారిలో ఠీవిగా నిల్చున్న ఈ రావి వృక్షం వల్ల ఎండ పడక ఇల్లు చీకటిగా మారిందని చెప్పారట. చెట్టు కొట్టివేస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారట. ‘‘చెట్టు ఎవరికీ అపకారం చేయదు. దాన్ని పోషిస్తే పుణ్యం. కొట్టేస్తే మహాపాపం. రావి వృక్షం శ్రీమహా విష్ణువుకు మారు రూపం. ఆయన నివాసస్థలం. ‘వృక్షా ణాః అశ్వద్ధోస్మి’ అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమా త్ముడు’’ అన్నాను. దాన్ని పూజించు... నీ సమస్యలన్నీ మటుమాయమవుతాయని హితవు చెప్పాను. అటు తర్వాత ఆయన సమస్యలన్నీ తీరాయి. వ్యాపారం నెమ్మ దిగా పుంజుకుంది. అపుత్రస్య చ పుత్రత్వం పాదపా ఏవ కుర్యతే తీర్థేషు పిండదానాదీన్ రోపకాణాం దదన్తితే మొక్కలు నాటితే సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. అన్ని తీర్థాలలో పిండదానం చేసిన ఫలం వృక్షాల ద్వారా దక్కుతుంది అని దీని భావం. (పద్మ పురాణం) వృక్షాలను పెంచిపోషిస్తే పర్యావరణానికి... తద్వారా ప్రపంచానికంతకూ మేలు జరగడమే కాదు. అలాచేసిన వారికి పుణ్యలోకాలు కూడా ప్రాప్తిస్తాయి. - సౌందరరాజన్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు