
'టీటీడీ ఆదాయంలో తెలంగాణ వాటా ఇప్పించండి'
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయంలో తెలంగాణ వాటా కోసం ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీటీడీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పించాలంటూ చిలుకూరు బాలజీ ఆలయ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలు వాయిదా వేసింది.