Soundarajan
-
'సెల్-బే' లో.. సినీతార ‘వర్షిణి’ సందడి...
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ టాలీవుడ్ నటి, యాంకర్ వర్షిణి గచ్చిబౌలిలోని సెల్ బే స్టోర్ వేదికగా సందడి చేశారు. షావోమీ ఆధ్వర్యంలోని సరికొత్త 5జీ హ్యాండ్సెట్ షావోమీ 14 సీవీ మోడల్‌ను నటి వర్షణి గురువారం ఆవిష్కరించారు.ఎప్పటికప్పుడు మారిపోతున్న సాంకేతికత అధునాతన జివన విధానానికి చేరువ చేస్తుందని ఆమె అన్నారు. వినూత్న ఫీచర్స్‌తో రూపొందించిన ఈ బ్రాండ్‌ను ఆవిష్కరించడం సంతోషమన్నారు. తెలంగాణ కస్టమర్లకు అధునాతన ఉత్పత్తులను అందించడంలో తమ సంస్థ ముందుంటుందని సెల్ బే వ్యవస్థాపకులు, ఎండీ సోమా నాగరాజు పేర్కొన్నారు.ఇండియా డిప్యూటీ హెడ్ కునాల్ అగర్వాల్, ఛానల్ సేల్స్ డైరెక్టర్ మల్లికార్జున రావు, ట్రేడ్ ఛానల్ హెడ్ సాజు రత్నం, జోనల్ హెడ్ సయ్యద్ అన్వర్, నేషనల్ రిటైల్ ఎండీ మొహమ్మద్ ఇఫ్తేకర్ పాల్గొన్నారు.ఇవి చదవండి: బే విండోకు.. డిజైన్ ఎక్స్‌లెన్స్! -
రాజ్‌భవన్‌లో.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
-
'టీటీడీ ఆదాయంలో తెలంగాణ వాటా ఇప్పించండి'
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయంలో తెలంగాణ వాటా కోసం ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీటీడీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పించాలంటూ చిలుకూరు బాలజీ ఆలయ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలు వాయిదా వేసింది. -
నిర్లక్ష్యం చేస్తే గుణపాఠం
పార్టీలకు అర్చక శంఖారావం హెచ్చరిక వైఎస్ సవరించిన చట్టంతో భద్రత ఆ చట్టాన్ని అమలు చేస్తామనే వారికే ఓట్లు హైదరాబాద్, అర్చకులను నిర్లక్ష్యం చేసే పార్టీలకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని అర్చక శంఖారావం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అర్చక సమాఖ్యల సంయుక్తంగా బుధవారం ఇక్కడి కాచిగూడ మున్నూరుకాపు భవన్లో శంఖారావం సభను నిర్వహించారు. ఈ సభను అర్చక శంఖారావం కన్వీనర్ డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చక సమాఖ్య ప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్రం లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను, డిమాండ్లను ప్రధాన రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే పార్టీలకే మద్దతు ఉంటుం దని వారు పేర్కొన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సవరించిన చట్టాన్ని అమలు చేయాలని, ఆ చట్టం వల్లే దేవాలయాల పునరుద్ధరణ జరిగిందని, అర్చకులకు భద్రత ఏర్పడిందని తెలిపారు. ఆ చట్టాన్ని అమలు చేస్తామనే హామీ ఇచ్చిన వారికే ఓటేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వాల నిర్వాకం వల్ల అర్చకులు వీధిన పడుతున్నారని, వేతనాలు లేవని, అన్యాక్రాంతం అవుతున్న దేవాలయ భూములను కాపాడటంలో దేవాదాయ శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని పేర్కొన్నారు. తమ వేతనాలు ట్రెజరీ ద్వారా చెల్లించాలని, సెక్షన్ 43 రిజిష్టర్‌లో వాటాదారులుగా ఉన్న అర్చకుల అందరి పేర్లను నమోదు చేయాలని, జిఓనెం261 ప్రకారం ఆలయాల ఆదాయాన్ని బట్టి అర్చకులకు కేడర్ స్ట్రెన్త్ ఏర్పాటు చేయాలని అన్నారు. ధార్మిక పరిషత్ నిర్ణయించిన ప్రకారం అర్చకులకు కనీస వేతనం ఇవ్వాలని, ఆలయ ఆదాయాన్ని బట్టి కమిషనర్ సర్క్యులర్ ప్రకారం పడితరం పెంచాలని డిమాండ్ చేశారు. అర్చకుల స్వాధీనంలో గల భూములకు పొజిషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలన్నారు. ఆలయాలల్లో అనాదిగా ఉన్న ఆచార వ్యవహారాలు కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎల్డీ నేత, ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్, వైఎస్ఆర్సీపీ నేత జనక్‌ప్రసాద్, టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి, కాంగ్రెస్‌నేత అశోక్ చౌదరి, బీజేపీ నాయకులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు చండీ హోమం నిర్వహించిన అనంతరం అర్చక భవన్ నుంచి వందలాది మంది అర్చకులు సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దీనిలో అర్చక సమాఖ్య ప్రతినిధులు అగ్నిహోత్రం ఆత్రేయబాబు, మురళీధర్‌రావు దేశ్‌పాండే, శ్రీకంఠం నందీశ్వర్, పెద్దింటి రాంబాబు, డాక్టర్ అనంతాచార్యులు, భాస్కరభట్ల రామశర్మ, తనుగుల రత్నాకర్, ఎవీఎస్ఆర్ఎస్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
సంబోధన...సంప్రదాయం
‘ఒరేయ్ చక్రధర్....ఎక్కడున్నావ్!’ ఓ తండ్రి గట్టిగా అరిచాడు. పెరట్లో నుంచి పరుగులు పెడుతూ వచ్చిన కొడుకు చక్రధర్ కోపంగా జవాబిచ్చాడు. ‘ఇక్కడే ఉన్నాను. ఎందుకలా అరుస్తారు?’ కొంచెం హెచ్చుతగ్గులతో దాదాపు ప్రతి ఇంటా ఇదే సన్నివేశం రోజూ తారసపడుతూనే ఉంటుంది. తండ్రి కుమారుణ్ణి ఒకటి, రెండుసార్లు పిలిచి, రాకపోయేసరికి కాస్త కోపంగా అలా అని ఉండొచ్చు. పిల్లవాడు పలకలేదు. కానీ, ఆ సర్వంతర్యామి...అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు పిలవగానే పలుకుతాడు. స్పందిస్తాడు. కాబట్టే మన పెద్దలు ఈ అలవాటు మనకు బోధించారు. సాంకేత్యం పరిహాస్యంగా వా స్తోభం హేళన మేవవా వైకుంఠ నామగ్రహణం అశేషాఘహరం విదుః ఒకరిని అవసరార్ధమే పిలిచినా, హేళనగా పిలి చినా, స్తోత్రం చేసినా...ఏ భావంతో చెప్పినా ఆ వైకుం ఠుడి నామం పాపాలన్నిటినీ పోగొడుతుందని భావం. ఇటీవల పిల్లలకు భగవంతుని పేరే పెట్టినా ఆ పేర్లతో పిలిచే అలవాటు పోయింది. చిలుకూరులో జరిగిన ఒక సన్నివేశాన్ని మీ అందరికీ చెబుతాను. స్వామివారి పాదతీర్థాన్ని భక్తులకు ఇచ్చేటపుడు ఎవరైనా చిన్న పిల్లలను తీసుకుని వస్తే వారి పేర్లు అడగటం నాకు అలవాటు. ఆ పేరు తెలుసుకుని, అలాగే పిలవడం నా మనసుకు ఆనందాన్నిస్తుంది. ఒకసారి ఓ అమ్మమ్మగారనుకుంటాను...చిన్న పాపను ఎత్తుకుని వచ్చింది. ఆ పాప ముద్దుగా ఉంది. మూడేళ్లుంటాయేమో. ఆమెకు కూడా తీర్థం అడిగి తీసుకున్నారు. ‘పాప పేరేమిటమ్మా’ అని అడిగాను. ‘శ్రీవిద్య అని పెట్టాము స్వామీ’ అని ఆ పెద్దావిడ అన్నారు. అద్భుతమైన పేరు. తాంత్రికమైనటువంటి సాధనకై పెట్టిన పేరు శ్రీవిద్య. ఇందులో లక్ష్మీ సరస్వతులున్నారు. ‘ఇంట్లో ఈ పాపను ఏమని పిలుస్తారమ్మా’ అని అడిగితే ‘శ్రీవిద్యనే అంటాం స్వామీ’ అని ఆమె జవాబిచ్చారు. కాస్సేపయ్యాక తీర్థం పంచడాన్ని వేరొక అర్చకస్వామికి అప్పగించి మంటపంవైపు వెళ్లాను. అక్కడ ఆ పాప మళ్లీ కనబడింది. వాళ్ల అమ్మమ్మ అలా దించగానే పరుగెత్తడం మొదలెట్టింది. ‘ఏయ్... మ్యాగీ ఎటుపోతున్నావ్’ అంటూ ఆ అమ్మమ్మ గట్టిగా అరిచారు. భక్తులంతా గొల్లున నవ్వారు. సరిగ్గా ఆ సమయానికి అక్కడున్నందువల్ల నేను సరదాగా జోక్యం చేసుకుని అన్నాను. ‘చూశావామ్మా...స్వామివారి వద్ద అబద్ధం ఆడావు. పాపను ఇంట్లో శ్రీవిద్య అని పిలుస్తామన్నావు. ఇప్పుడేమో మ్యాగీ అంటున్నావు. అమ్మాయికి నూడుల్స్‌కు పెట్టే పేరు పెడతావామ్మా నువ్వు...’ అన్నాను. అందరూ గమనించవలసిన ముఖ్య విషయం ఉంది. ఈ ఆధునిక యుగంలో స్వామివారినిగానీ, మన దైవాన్ని గానీ, అమ్మవారినిగానీ తలచుకొనే అవకాశం తక్కువ. ఏ పండగకో, ఉత్సవానికో వెళ్లినప్పుడే స్వామివారిని తలుచుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో భగవన్నామాన్ని నిరంతరం ఉచ్చరించడానికి అవకాశం మనకు పిల్లల పేర్ల ద్వారా కలుగుతుంది. వాళ్లకు భగవత్సంబంధమైన పేర్లు పెట్టి వారిని అలాగే పిలుస్తుంటే భగవంతుని అష్టోత్తరం చదివినట్లు అవుతుంది. చక్రధర్ అని పేరుపెట్టి చంటి అని పిలుస్తున్నారు. పండు అంటున్నారు. కనీసం రోజుకి కొన్నిసార్లయినా వారిని పూర్తి పేరుతో పిలిచే అలవాటు చేసుకోవాలి. - సౌందరరాజన్ చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు