
మేడిపల్లిలో ఏవీ ఇన్ఫో ప్రాజెక్ట్‌లు
అభివృద్ధి చెందిన ప్రాంతంలో సొంతింటి కలను సాకారం చేసుకోవడం కాస్త డబ్బుతో కూడుకున్న వ్యవహారం. అందుకే సామాన్యులకు సైతం ధరలు అందుబాటులో ఉండేలా.. ఆధునిక వసతులతో కూడిన పలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నామని ఏవీ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ జే వెంకట్‌రెడ్డి చెప్పారు.
మేడిపల్లి హైవే పక్కనే రెండున్నర ఎకరాల్లో ‘ఏవీ ఇన్ఫో ప్రైడ్’ పేరుతో ఆధునిక బహుళ అంతస్తుల నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నాం. మొత్తం 210 ఫ్లాట్లు. అన్నీ 2, 3 పడక గదుల ఫ్లాట్లే. ధర రూ.32.5 లక్షల నుంచి రూ.48 లక్షల వరకున్నాయి. ఇప్పటికే 40 శాతం మేర ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక వసతులన్నీ కల్పిస్తున్నాం.
పీ అండ్ టీ కాలనీలో 850 గజాల్లో ‘రాచురి అరణ్య’ అపార్ట్‌మెంట్‌నూ నిర్మిస్తున్నాం. ఇందులో మొత్తం 20 ఫ్లాట్లు. 1,065 చ.అ. నుంచి 1,100 చ.అ. మధ్య ఫ్లాట్ విస్తీర్ణాలుంటాయి. ధర చ.అ.కు రూ.2,350గా చెబుతున్నాం.