
ఘోరం
దువ్వూరు,
మండలపరిధిలోని క్రీస్తురాజపురం వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైదుకూరుకు వస్తున్న ఆటోను కర్నూలు వైపు వెళుతున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ప్రొద్దుటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. బుధవారం సాయత్రం 6.30 గంటలకు దువ్వూరు నుంచి మైదుకూరుకు బయలుదేరిన ఆటోను క్రీస్తురాజపురం వద్ద కర్నూలు వె ళుతున్న లారీ ఢీకొంది. ఈప్రమాదంలో చింతకుంట ఇమాంహుస్సేన్(చింతకుంట)గువ్వల మైసూరారెడ్డి,(నాగాయపల్లె)కమతం
వెంకటరెడ్డి(గుడిపాడు)సన్నాయి.చంద్రశేఖర్(గుడిపాడు)సన్నాయినాగేంద్ర(గుడిపాడు)అక్కడిక్కక్కడే మృతి చెందారు. ప్రొద్దుటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బోయ సుశీలమ్మ(గుడిపాడు)బెచ్చపాపయ్య (నాగాయపల్లె) మృతి చెందారు. ఇరగంరెడ్డి రాజేశ్వరి(గుడిపాడు)చింతకుంటమాబు(చింతకుంట)గోపిరెడ్డి హేమలత(గుడిపాడు)లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో చింతకుంట మాబు పరిస్థితి ఆందోళనాకరంగా ఉంది. ఆటోలో గుడిపాడుకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. చీకటి పడుతున్న సమయంలో ప్రమాదంలో జరగడంతో క్షతగాత్రులకు దిక్కు తోచలేదు. సంఘటనా ప్రాంతం బాధితుల రోదనలతో నిండిపోయింది. ఆటో నుజ్జునుజ్జయింది. మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. 108 వాహనం ఆలస్యంగా రావడంతో తీవ్రగాయాలైన వారు ప్రాణాలతో కొట్టుమిట్టాడారు. సంఘటనా స్థలికి డీఎస్సీ శివారెడ్డి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.