
పేకాట శిబిరంపై దాడి: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
హైదరాబాద్: నగరంలో పేకాట ఆడుతూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని అలియాస్ వెంకట మధుసూధనరావు పట్టుబడ్డారు. బేగంపేట హరితప్లాజాలో పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి మెరుపు దాడి చేశారు.
ఈ దాడిలో ఈలి నాని సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 లక్షలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈలి నాని తాడేపల్లిగూడెం శాసనసభ్యునిగా ఉన్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం టీడీపీ ఇంఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితులను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.