కోరుట్ల/మెట్‌పల్లి: రాజకీయాల్లో ఆయనది అలుపెరగని పోరాటం.. నమ్మిన సిద్ధాంతం కోసం రాజీపడని మనస్తత్వం.. మాస్, డైనమిక్ లీడర్‌గా ప్రజల్లో గు ర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్‌లు(82).. జిల్లా రాజకీయాల్లో విలక్షణమైన వ్యక్తిగా పేరు సంపాదించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బా ధపడుతున్న ఆయన.. బుధవారం హైదరాబాద్ అ పోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. సంపూర్ణ ఆ రోగ్యంగా ఉన్న ఆయన.. రెండేళ్ల క్రితం కరోనా బారి న పడ్డారు. ఆ తర్వాత కోలుకున్నా.. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. అప్పటినుంచి తరచూ ఆస్పత్రుల్లో వైద్యచికిత్సలు తీసుకుంటున్నారు. కొద్దిరోజు ల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కు టుంబ సభ్యులు హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చే ర్పించారు. అక్కడ చిక్సిత పొందుతున్న గుండెపోటుకు గురై తనువు చాలించారు. ఆయన మరణంతో నియోజకవర్గంలో విషాదఛాయలు అలముకున్నా యి. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయా రు. పార్థివదేహాన్ని మెట్‌పల్లిలోని ఆయన స్వగృహా నికి తీసుకొచ్చారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య జ్యోతిదేవి, ముగ్గురు కుమారులు ఉన్నారు.
సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభం..
► మెట్‌పల్లి మండలం వెంకట్రావ్‌పేట గ్రామానికి చెందిన రామ్‌లు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్య పట్టా పొందారు.
► ఓవైపు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసూ్తనే మరోవైపు రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు.
► 1968లో వెంకట్రావ్‌పేట సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
► 1978లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.
► 1983లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి రెండోస్థానంలో నిలిచారు.
► 1985 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి చెన్నమనేని విద్యాసాగర్‌రావు చేతిలో కేవలం 372 ఓట్ల స్వల్వ తేడాతో ఓటమి చెందారు.
► 1989, 94, 99 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు.
► 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ లభించకపోవడంతో జనతా పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు.
► ఆ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుపై విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
► ఆ సమయంలో ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించారు.
► 2009లో పోటీకి దూరంగా ఉన్న ఆయన.. 2014లో మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయారు.
► 2018లో పోటీకి దూరంగా ఉన్నారు.
► ఎన్నికల్లో అనేకమార్లు పరాజయం చవిచూసినా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ కొమొరెడ్డి రామ్‌లు ఆదర్శంగా నిలిచారు.
సతీమణి జ్యోతికి రాజకీయంగా ప్రోత్సాహం
► కుటుంబంలో రాజకీయంగా తన సతీమణి జ్యోతిదేవిని కూడా కొమొరెడ్డి రామ్‌లు ఎంతో ప్రోత్సహించారు.
► న్యాయ విద్య అభ్యసించిన జ్యోతిని 1998లో మెట్‌పల్లికి జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలిపారు.
► ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు.
► అంతకుముందు జ్యోతి మెట్‌పల్లి ఎంపీపీగా ప్రజాసేవలో పాలుపంచుకున్నారు.
► కొమొరెడ్డి రామ్‌లు – జ్యోతి దంపతులకు ముగ్గురు కుమారులు.
► తమలాగే వారిని కూడా న్యాయవాదులుగా తీర్చిదిద్దారు.
► పెద్ద కుమారుడు కరంచంద్‌ను తమ రాజకీయ వారసునిగా వచ్చే ఎన్నికల్లో పోటీలో నిలపాలని నిర్ణయించారు.
ప్రత్యర్థులకు హడల్
రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒక పార్టీవారిని మరోపార్టీ వారు విమర్శించడం సాధారణం. కానీ, కోరుట్ల నియోజకవర్గంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉండడం గమనార్హం.
రామ్‌లును విమర్శించడానికి ప్రత్యర్థి పార్టీల నాయకులు ఎవరు కూడా సాహసించకపోవడం ఆయన విలక్షణమైన వ్యక్తిత్వానికి నిదర్శనమనే అభిప్రాయం ఉంది.
రాజీపడని మనస్తత్వంతో నష్టాలు..
నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన ఏనాడూ రాజీపడలేదు. దీంతో రాజకీయంగా చాలా నష్టపోయారనే అభిప్రాయం ఉంది. బీసీ నాయకుడిగా ఆదినుంచీ దొరల పాలనను వ్యతిరేకించే వారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా అనేక ఆటుపోట్లు ఎదురైనా వెనుకంజ వేయలేదు. ఇదే ఆయనకు ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచి్చంది.
పలువురి సంతాపం
కొమొరెడ్డి రామ్‌లు మృతికి మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతోపాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
డైనమిక్ లీడర్.. రామ్‌లు
Published Thu, Apr 6 2023 8:18 AM | Last Updated on Thu, Apr 6 2023 8:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment