మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్‌లు
మల్లాపూర్(కోరుట్ల): ప్రభుత్వ వైఫల్యాలలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడుతామని మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్‌లు అన్నారు. మల్లాపూర్ మండలంలోని రేగుంటలో అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడిన యువరైతు మాధవేని ఆదిరెడ్డి కుటుంబాన్ని శుక్రవార పరామర్శించి మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతోనే రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ అయిన లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. ప్రతి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్గరీని ఏర్పాటు చేయాలని కోరారు. చెరుకురైతులు, కార్మికులతో కలిసి ప్రభుత్వం దిగివచ్చే దాక పోరాడుతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కటుకం గంగారెడ్డి, అధికార ప్రతినిధి బోయిని హన్మాండ్లు, ఓబీసీ మండల కన్వీనర్ వంగ అశోక్‌యాదవ్, సీనియర్ నాయకులు రాంరెడ్డి, మండలయూత్ అధ్యక్షుడు శశిగౌడ్, నాయకులు సాయికుమార్, పెనుకుల మల్లేశ్, ప్రవీణ్, వంశీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment