మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చల్లవాడలో అహేరి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత విద్యార్థి సంఘటన(సమాఖ్య) వ్యవస్థాపకుడు దీపక్ దాదా ఆత్రం గన్‌మెన్ నానాజీ నాగబోస్(45)పై మావోయిస్టులు కాల్పులు జరిపారు.
అక్కడికక్కడే మృతి.. తప్పించుకున్న ఆత్రం
కాళేశ్వరం/బెజ్జూర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చల్లవాడలో అహేరి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత విద్యార్థి సంఘటన(సమాఖ్య) వ్యవస్థాపకుడు దీపక్ దాదా ఆత్రం గన్‌మెన్ నానాజీ నాగబోస్(45)పై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో నానాజీ నాగబోస్ అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం బీఆర్.అంబేద్కర్ 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మాజీ ఎమ్మెల్యే దీపక్ దాదా ఆత్రం అహేరి నుంచి చల్లవాడకు ఉదయం వెళ్లారు.
వేడుకలు జరుగుతుండగా నాగబోస్ మంచినీళ్లు తాగేందుకు తన దగ్గర ఉన్న తుపాకీతో వాహనాలు నిలిచిన స్థలానికి ఒంటరిగా వెళ్లాడు. అప్పటికే గ్రామంలో మారువేషంలో మోహరించి ఉన్న మావోయిస్టులు నాగబోస్‌పై 15 రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. ఆ తర్వాత మావోయిస్టులు అతడి వద్ద ఉన్న తుపాకీని తీసుకెళ్లినట్లు సమాచారం. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే దీపక్ ఆత్రం వెంటనే మావోయిస్టులకు దొరకకుండా అక్కడినుంచి తప్పించుకున్నారు.