సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే డిమాండుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు అడ్డుకున్నారు.
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే డిమాండుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు అడ్డుకున్నారు. గురువారం మధ్యాహ్నం తన ఇంటి నుంచి బయలుదేరిన జగ్గారెడ్డిని టౌన్ పోలీసుస్టేషన్ ఎదుట పోలీసులు అడ్డుకున్నారు.
ఆమరణ నిరాహారదీక్షకు అనుమతి లేదని చెప్పగా.. ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన జగ్గారెడ్డిని పుల్కల్ పోలీస్‌స్టేషన్‌కు, ఆయన అనుచరులను కంది మండలం ఇంద్రకరణ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టు అనంతరం పుల్కల్ పోలీసుస్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేయాల్సిన మెడికల్ కాలేజీని సిద్దిపేటకు తరలించినా.. ఎమ్మెల్యే అడ్డుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.