మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు జైలుశిక్ష | former mla Anna Rambabu sentenced for two years | Sakshi
Sakshi News home page

టీడీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు జైలుశిక్ష

Published Mon, Sep 18 2017 6:26 PM | Last Updated on Wed, Oct 3 2018 7:34 PM

మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు జైలుశిక్ష - Sakshi

మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు జైలుశిక్ష

గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. ఓ ప్రైవేటు కేసులో మార్కాపురం కోర్టు ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది.

2008లో మార్కాపురానికి చెందిన గోళ్ల సురేంద్రనాథ్‌కి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి మధ్య భూమి విషయంలో వివాదం ఉంది. ఆ వ్యవహారంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ సురేంద్రనాథ్ భార్య కోర్టును ఆశ్రయించారు. దీనిపై తీర్పు ఇచ్చిన మార్కాపురం కోర్టు.. ఆ వెంటనే రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది.

జైలుశిక్ష తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు రాంబాబుకు అక్టోబర్‌ 13వ తేదీ వరకు కోర్టు అవకాశం ఇచ్చింది. కొద్ది నెలల కిందటే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన అన్నా రాంబాబు.. నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ సమయంలో తిరిగి అదే పార్టీకి వత్తాసుగా హల్‌చల్‌చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement