మాజీ శాసనసభ్యులు బెరైడ్డి శేష శయనారెడ్డి, జి.వెంకట శేషు, తలారి రుద్రయ్య మృతి పట్ల శాసనసభ సంతాపం ప్రకటించిది. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి జరిగిన మోసంపై చర్చకు అనుమతించనందుకు నిరసనగా శుక్రవారం అసెంబ్లీ పోడియంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంగా గందరగోళం మధ్యే స్పీకరు కోడెల శివ ప్రసాదరావు సంతాప ప్రతిపాదనలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు సభ మౌనం పాటించింది.
మాజీ ఎమ్మెల్యేల మృతికి అసెంబ్లీ సంతాపం
Published Fri, Sep 9 2016 6:03 PM | Last Updated on Wed, Oct 3 2018 7:38 PM
Advertisement
Advertisement