
పరకాల: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పరకాల మాజీ ఎమ్మెల్యే బండారి శారారాణి (55) శనివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాస గృహంలో సాయంత్రం ఆమెకు గుండెనొప్పి రాగా.. ఆస్పత్రికి తరలించేలోగానే తుదిశ్వాస వదిలారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అసమ్మతి ఎమ్మెల్యేల్లో శారారాణి ఒకరు. ఆ తర్వాత టికెట్ లభించకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాగా, శారారాణి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని తెలిసింది
Comments
Please login to add a commentAdd a comment