mla dead
-
కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి.. సీఎం దిగ్భ్రాంతి
జైపూర్: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మ(77) ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భన్వర్ లాల్ భౌతికకాయాన్ని హనుమాన్ నగర్లోకి ఆయన నివాసానికి తరలించారు. అంత్యక్రియలను సోమవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1945 ఏప్రిల్ 17న జన్మించారు భన్వర్ లాల్ శర్మ. 17 ఏళ్లకే రాజకీయ రంగ ప్రవేశం చేసి 1962లో సర్పంచ్‌గా గెలుపొందారు. 1982 వరకు ఆయనే ఆ పదవిలో ఉన్నారు. 1985 తొలిసారి లోక్‌దళ్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జనతాదళ్‌లో చేరారు. 1990లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సర్దార్‌షహర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భన్వర్ లాల్.. కాంగ్రెస్ పార్టీ నుంచి 1998, 2003, 2013, 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. సీఎం విచారం.. భన్వర్ లాల్ మృతిపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆయనను పరామర్శించేందుకు ఎస్ఎంఎస్ ఆస్పత్రికి కూడా వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: షిండే, ఠాక్రే వర్గాలకు ఈసీ షాక్! -
మాజీ ఎమ్మెల్యే శారారాణి కన్నుమూత
పరకాల: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పరకాల మాజీ ఎమ్మెల్యే బండారి శారారాణి (55) శనివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాస గృహంలో సాయంత్రం ఆమెకు గుండెనొప్పి రాగా.. ఆస్పత్రికి తరలించేలోగానే తుదిశ్వాస వదిలారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అసమ్మతి ఎమ్మెల్యేల్లో శారారాణి ఒకరు. ఆ తర్వాత టికెట్ లభించకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాగా, శారారాణి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని తెలిసింది -
ఉగ్రదాడిలో ఎమ్మెల్యే సహా ఆరుగురి మృతి
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఉగ్రవాదులు పంజా విసిరారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తిరప్ జిల్లాలో మంగళవారం జరిగిన ఉగ్ర దాడిలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కి చెందిన ఎమ్మెల్యే తిరంగ్ అబో సహా ఆరుగురు వ్యక్తులు మరణించారు. కాగా ఈ దాడి ఎన్ఎస్సీఎన్ (ఐఎం) మిలిటెంట్ల పనేనని అనుమానిస్తున్నారు. తిరంగ్ అబో అసోం నుంచి ఖోన్సా వెస్ట్ నియోజకవర్గానికి వెళుతున్న క్రమంలో తిరప్ జిల్లాలోని బోగపని గ్రామం వద్ద ఉగ్రవాదులు ఎమ్మెల్యేపై కాల్పులకు తెగబడ్డారు. ఉగ్ర దాడిలో ఎమ్మెల్యే సహా ఆరుగురు వ్యక్తులు ఘటనాస్ధలంలోనే మరణించారని తిరప్ డీసీపీ తుంగన్ తెలిపారు. కాగా దాడిని మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా తీవ్రంగా ఖండించారు. దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను ఆయన కోరారు. -
పర్చూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఒంగోలు : ప్రకాశం జిల్లా పర్చూరు మాజీ ఎమ్మెల్యే ముద్దుకూరు నారాయణరావు (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం ముద్దుకూరు నారాయణరావు తన నివాసంలోనే మరణించారు. ఆయన స్వస్థలం పర్చూరు మండలం వీరన్నపాలెం. ముద్దుకూరు నారాయణరావు1972-78 సంవత్సరాల్లో రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొందారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.