వైభవంగా నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం | Chariot exposition nilakanthesvarasvamy | Sakshi
Sakshi News home page

వైభవంగా నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం

Published Wed, Dec 14 2016 12:09 AM | Last Updated on Wed, Oct 3 2018 7:38 PM

వైభవంగా నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం - Sakshi

వైభవంగా నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం

డీ.హీరేహాళ్‌ : మండల కేంద్రమైన డీ.హీరేహాళ్‌లోని నీలకంఠేశ్వరస్వామి రథోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారిని వెండి ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం రథోత్సవాన్ని ప్రారంభించడానికి మేళతాళాలతో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, గ్రామ ప్రముఖులు దాదు సాబ్‌, సర్పంచ్‌ లక్ష్మీదేవి లను ఆహ్వానించారు. అనంతరం రథోత్సవానికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని లాగారు. శివనామస్మరణతో సాగిన రథోత్సవంలో  నందికోళ్లతో చేసిన విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్‌ఐ శేఖర్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు శింగాడి జగదీష్, బోజరాజ్‌నాయక్, కరడి మల్లికార్జున, సింగాడి మంజునాథ, టీడీపీ నాయకులు మాకాసి వెంకటేశులు, నాగళ్లి రాజు, తిప్పేస్వామి, నరసింహులు తెలిపారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement