తుపాకితో మాజీ ఎమ్మెల్యే హల్‌చల్
కృష్ణాజిల్లా గుడివాడలో టీడీపీ నేత తుపాకీతో హల్‌చల్ చేశారు.
కృష్ణాజిల్లా గుడివాడలో టీడీపీ నేత తుపాకీతో హల్‌చల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గురువారం మధ్యాహ్నం గుడివాడ క్లబ్ వద్ద జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. మద్యం మత్తులో ఉన్న ఆయన క్లబ్ గేటు సమీపంలో తన వద్ద ఉన్న తుపాకితో రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.
ఆ శబ్దం విన్న స్థానికులు భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి చెల్లాచెదురయ్యారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. అయితే, ఘటన జరిగిన వెంటనే రావి వెంకటేశ్వరరావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2.30-3 గంటల మధ్యలో ఈ కాల్పుల ఘటన జరిగినట్లు తెలుస్తోంది.