
సాక్షి, ఖమ్మం: మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నరసయ్య (87) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తన స్వగ్రామం కల్లూరు మండలం పోచారంలో తుదిశ్వాస విడిచారు. మధిర శాసనసభ స్థానానికి రెండుసార్లు సీపీఎం ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2009 శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్ర అగ్రనాయకత్వం తీరు నచ్చక పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి... మరో నెలలో గడువు ముగుస్తుందనగా రాజీనామా చేశారు. చనిపోయేంత వరకు పార్టీ సిద్ధాంతలకు కట్టుబడి పనిచేశారు. వెంకట నరసయ్య మృతి పట్ల పలువురు సీపీఎం జిల్లా నాయకులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.