‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్‌: బెదిరింపులు కూడా వస్తున్నాయి! | CPI Ex MLA Gummadi Narsaiah Biopic: Movie Team Gets Threats | Sakshi
Sakshi News home page

‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్‌: బెదిరింపులు కూడా వస్తున్నాయి!

Published Sat, Aug 21 2021 11:28 AM | Last Updated on Sat, Aug 21 2021 11:32 AM

CPI Ex MLA Gummadi Narsaiah Biopic: Movie Team Gets Threats - Sakshi

మాట్లాడుతున్న గుమ్మడి నర్సయ్య చిత్ర దర్శకుడు పరమేశ్వర్‌ (ఎడమ)  

సాక్షి, ఇల్లెందు: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్రపై తీస్తున్న సినిమా షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభిస్తామని దర్శకుడు పరమేశ్వర్‌ వెల్లడించారు. ఇటీవల కారు బోల్తా పడగా ప్రమాదం నుంచి బయటపడిన గుమ్మడి నర్సయ్యను ఆయన శుక్రవారం ఇల్లెందులో పరామర్శించారు. ఆ తర్వాత యూనిట్‌ సభ్యుడు కృష్ణతో కలిసి పరమేశ్వర్‌ విలేకరులతో మాట్లాడారు. గుమ్మడి నర్సయ్య చిత్రం పోస్టర్‌ విడుదల చేసినప్పటి నుంచి వివిధ వర్గాల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. అంతేకాదు బెదిరింపులు కూడా వస్తున్నాయని వెల్లడించారు. అయితే, ఎవరికీ భయపడకుండా ఉన్నది ఉన్నట్లుగా ఓ ప్రజానేత జీవితాన్ని వెలుగులోకి తీసుకువస్తామని తెలిపారు. తమ సినిమా విడుదలయ్యాకైనా నేతల్లో కొంత మార్పు వస్తుందనే ఆశ ఉందని చెప్పారు.
చదవండి: మాట్లాడుతున్న గుమ్మడి నర్సయ్య చిత్ర దర్శకుడు పరమేశ్వర్‌ (ఎడమ)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement