
జోగులాంబ : గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన 1999లో మొదటిసారి గద్వాల నియోజకవర్గంనుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 వరకు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు.
ప్రముఖుల సంతాపం
గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. అబ్కారీ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిలు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు తమ సానుభూతి తెలియజేశారు.