
ఎన్నారైకు టీడీపీ నేత కుమారుడి వేధింపులు
రాష్ట్రంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు హల్‌చల్ సృష్టిస్తున్నారు.
విజయవాడ : రాష్ట్రంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు హల్‌చల్ సృష్టిస్తున్నారు. ప్రతిరోజు ఏదోక ప్రాంతంలో తమ్ముళ్ల లీలలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత అక్కినేమి లోకేశ్వరరావు తనయుడి వికృత చేష్టలు బయటపడ్డాయి.
లోకేశ్వరరావు కుమారుడు విజయకృష్ణ గత కొన్ని రోజులుగా ఓ ఎన్నారై మహిళను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో సదరు మహిళ విజయవాడ పోలీస్ కమిషనర్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పెనమలూరు పోలీసులు గురువారం విజయకృష్ణను అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.