సీతక్క కుమారుడి వివాహానికి హాజరైన చంద్రబాబు | chandrababu naidu attends former mla seethakka sons wedding | Sakshi
Sakshi News home page

సీతక్క కుమారుడి వివాహానికి హాజరైన చంద్రబాబు

Published Fri, Apr 7 2017 11:48 AM | Last Updated on Wed, Oct 3 2018 7:38 PM

ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుడి వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

వరంగల్‌: ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుడి వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరయ్యారు. శుక్రవారం హన్మకొండలోని విష్ణుప్రయ గార్డెన్‌లో జరుగుతున్న వివాహ మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. వరంగల్‌ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలోని హెలీప్యాడ్‌ వద్ద దిగిన ఆయన అక్కడ నుంచి వాహన శ్రేణిలో పెళ్లి మండపానికి చేరుకున్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వెంట రేవంత్‌రెడ్డి, ఎల్‌. రమణ సహా పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement