సీతక్క కుమారుడి వివాహానికి హాజరైన చంద్రబాబు
వరంగల్: ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుడి వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరయ్యారు. శుక్రవారం హన్మకొండలోని విష్ణుప్రయ గార్డెన్లో జరుగుతున్న వివాహ మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలోని హెలీప్యాడ్ వద్ద దిగిన ఆయన అక్కడ నుంచి వాహన శ్రేణిలో పెళ్లి మండపానికి చేరుకున్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వెంట రేవంత్రెడ్డి, ఎల్. రమణ సహా పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.