మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురువారం చేయతలపెట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు అడ్డుకున్నారు.

సంగారెడ్డి: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురువారం చేయతలపెట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి జోగిపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కలెక్టరేట్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు ఆయన తన ఇంటినుంచి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరగా పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు.