తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.