kandula durgesh
-
రుషికొండ భవనాలకు అన్ని అనుమతులున్నాయి : మంత్రి దుర్గేశ్
-
రుషికొండ భవనాలకు అనుమతులున్నాయి: మంత్రి దుర్గేష్
సాక్షి, గుంటూరు: రుషికొండ భవనాలకు అనుమతులున్నాయని స్పష్టమైంది. శాసన మండలిలో ఈ విషయాన్ని మంత్రి దుర్గేష్ స్వయంగా ప్రకటించారు. రుషికొండ పర్యాటక భవనాలకు సీఆర్‌జెడ్, జీవీఎంసీ అనుమతులు ఉన్నాయన్నారు.కాగా, సభలో మంత్రుల మాటలు దారుణంగా ఉన్నాయని.. రండిచూసుకుందాం.. సిగ్గుందా అంటూ మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రిషికొండ భవనాలు ప్రభుత్వ భవనాలుగా కట్టాం. సీఎం, డిప్యూటీ సీఎం అందరూ చూసి వచ్చారు కదా? తత్కాలిక భవనాలకు అమరావతిలో ఫర్నిచర్‌తో కలిపి ఎస్ఎఫ్టీ 14 వేలు ఖర్చు చేశారన్నారు.రుషికొండలో కట్టినవన్నీ ప్రభుత్వ భవనాలు. ఆ భవనాలన్ని బాగా కట్టారని సీఎం, డిప్యూటీ సీఎం లే చెప్పారు కదా.. అందులో ఏదైనా లోపం జరిగితే విచారించుకోండి. అవి ప్రభుత్వ భవనాలు, వైఎస్ జగన్ సొంత భవనాలు కాదు కదా అని బొత్స ప్రశ్నించారు.మంత్రి మనోహర్ వ్యాఖ్యలపై మండలి చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బొత్సకు ఎందుకు మాట్లాడేందుకు అనుమతిచ్చారంటూ మంత్రి మనోహర్ ప్రశ్నించారు. మంత్రి మనోహర్ మీరు ఒక వైపే చూస్తున్నారు.. రెండో వైపు చూడండంటూ ఛైర్మన్ వ్యాఖ్యానించారు. -
కూటమిలో కొట్లాట..
-
టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు.. మంత్రికి నిరసన సెగ
తూర్పుగోదావరి, సాక్షి: నిడదవోలు టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. కంసాలిపాలెంలో మంత్రి కందుల దుర్గేష్‌కు నిరసన సెగ తగిలింది. తమను పట్టించుకోవటం లేదని మంత్రిని టీడీపీ నేతులు నిలదీశారు. మంత్రి దుర్గేష్ ఎదుటే టీడీపీ, జనసేన నేతలు ఘర్షణకు దిగారు. -
చిరంజీవి మహోనతమైన వ్యక్తి...
-
'విశ్వంభర' సెట్లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి.. ఫొటోలు వైరల్
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. హైదరాబాద్‌లోని 'విశ్వంభర' సెట్లో ఇది జరిగింది. చిరుతో పాటు కీరవాణి, దర్శకుడు వశిష్ట, నిర్మాతలు కూడా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా చిరు.. మంత్రి దుర్గేష్‌తో కాసేపు ముచ్చటించారు. అలానే ఈ భేటీ విషయమై ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ పెట్టారు.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ సినిమా)'మిత్రుడు కందుల దుర్గష్.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా 'విశ్వంభర' సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లని సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటారని చెప్పారు' అని చిరంజీవి రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా 'విశ్వంభర' సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు!💐💐… pic.twitter.com/R7tDsrPR6R— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2024 -
రాజమండ్రిలో సైకిల్, గ్లాసు రచ్చ రచ్చ
రాజమండ్రిలో టీడీపీ-జనసేనల మధ్య రాజకీయం మరింత వేడెక్కిందనడం కంటే రచ్చకెక్కిందనడమే ఇక్కడ సరిపోతుంది. ప్రధానంగా సైకిల్ పార్టీ, గ్లాసు పార్టీలు ఇక్కడ సీటుపై ఒకరిపై ఒకరు కారాలు-మిర్యాలు నూరుకుంటూ సీటు మాదే అంటే మాది అంటూ.ప్రకటనలు చేసేస్తున్నారు. ఇందుకు కారణం రాజమండ్రి రూరల్ సీటు జనసేనదేనంటూ పవన్ కళ్యాణ్ తేల్చేయడమే.. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్.. రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించగా.. తాజాగా రాజమండ్రి రూరల్ కూడా జనసేనకేనని తేల్చేశారు. దానిలో భాగంగానే కందుల దుర్గేష్ జనసేన రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా బరిలోకి దిగుబోతున్నానంటూ ప్రకటించి తెలుగుదేశం శ్రేణులకు షాకిచ్చారు. ఇదే విషయాన్ని టీడీపీ అధిష్టానంతో చర్చించి త్వరలో అధికారికంగా ప్రకటిస్తానని కూడా పవన్ తెలిపినట్లు దుర్గేష్ తెలిపారు. రాజమండ్రి రూరల్ టికెట్ నాదే పవన్ ఇచ్చిన హామీతో రాజమండ్రి రూరల్ టికెట్ నాదేనంటూ ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు కందుల దుర్గేష్. రాజమండ్రి టికెట్ తనదేనంటూ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. తనకు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేసారని, ఇక్కడ నుంచి జనసేన తరఫున తాను బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని కూడా కందుల దర్గేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేను సీనియర్ని.. ఈ టికెట్ నాదే తాను జిల్లాలో సీనియర్ నాయకుడినని, జిల్లాలో పార్టీ వ్యవస్థాపకుడినని, టికెట్ తనదే అంటున్నారు గోరంట్ల బుచ్చయ్యచౌదరి. ‘ఇందులో ఎలాంటి వివాదం లేదు. పార్టీ టికెట్ నాకే. జనసేనకు మరో నియోజకవర్గం కేటాయిస్తాం. సర్దుబాటు వాళ్లిష్టం’ అంటూ గోరంట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న గోరంట్ల తన సీటుకే ఎసరు పడుతుందా అనే డైలమాలో పడ్డారు. టీడీపీ నేతల్లో అసంతృప్తి రాజానగరం టికెట్ జనసేన ప్రకటించడంతో ఇప్పటికే అసంతృప్తిలో ఉన్న టీడీపీ నేతలు.. రాజమండ్రి రూరల్‌లో సైతం ఇదే పరిస్థితి వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం మాత్రం.. పవన్ కళ్యాణ్ టికెట్లు ప్రకటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాజమండ్రి రూరల్ ,రాజానగరం స్థానాలు జనసేనకు ఇస్తే తమ సామాజిక వర్గం సీట్లు కోల్పోయేనట్లేనని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పవన్ టికెట్లను ఇచ్చుకుపోతూ ఉంటే చంద్రబాబు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఇది చంద్రబాబు ఇచ్చిన హామీతోనే పవన్ ఇలా చేస్తున్నారా? అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా రాజమండ్రి రూరల్ సీటుపై టీడీపీ-జనసేనల మధ్య రసవత్తర రాజకీయమే నడుస్తోంది. -
పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించరు?
-
పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించరు?: దుర్గేష్
రాజమండ్రి: ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేసినా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ ఎందుకు స్పందించడం లేదని వైఎస్ఆర్ సీపీ నేత కందుల దుర్గేష్ సూటిగా ప్రశ్నించారు. ప్రశ్నించడానికే ఏర్పడిన పార్టీ...రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. పార్టీ మారినవారికి కేబినెట్లో చోటు కల్పించడం దారుణమని దుర్గేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు నలుగురికి ఏపీ కేబినెట్లో చోటు కల్పించిన విషయం తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు వారికి కీలక శాఖలు కేటాయించిన విషయం విదితమే. -
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ
-
12న వైఎస్సార్ సీపీలో చేరుతున్నా: దుర్గేష్
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్... వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నెల 12న వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టు దుర్గేష్ ప్రకటించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు కృషి చేస్తానని, అందుకే వైఎస్సార్ సీపీలో చేరుతున్నానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు 2014 మార్చిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క నియోజకవర్గంలోనూ విజయం సాధించలేకపోయింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ.. టీడీపీ-బీజేపీ కూటమిని దీటుగా ఎదుర్కొని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ జనగళాన్ని సమర్థవంతంగా విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు వైస్సార్ సీపీవైపు ఆకర్షితులవుతున్నారు. -
బాబూ! నీ రాజకీయ చిరునామా కాంగ్రెస్ భిక్షే
కాకినాడ : టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు రాజకీయంగా చిరునామాను ఇచ్చింది కాంగ్రెస్సేనన్న వాస్తవాన్ని మరిచి మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన అధ్యక్షుడు కందుల దుర్గేష్ విమర్శించారు. డీసీసీ సారథిగా కందుల సోమవారం కాకినాడలోని పార్టీ కార్యాలయం కళా వెంకట్రావు భవనంలో సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తొలుత పార్టీ కార్యాలయం రిజిస్టర్లో సంతకం చేసిన అనంతరం ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని చంద్రబాబు అడ్రస్‌లేని పార్టీకి అధ్యక్షుడివనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్ఈజడ్ భూముల్ని వెనక్కి తీసుకుంటామన్న చంద్రబాబు ఇప్పుడు మాటమార్చి అక్కడ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయనడాన్ని తప్పుపట్టారు. ఇకపై తమపార్టీ ప్రజల సమస్యలపై పోరాడుతుందని, జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాజకీయ మార్పునకు నాందిగా పేరున్న తుని నుంచి ఈ నెల 19న గ్రామ పర్యటనలకు శ్రీకారం చుడతామన్నారు. ప్రతి నెలా 5న క్రమం తప్పకుండా డీసీసీ సమావేశం నిర్వహిస్తామన్నారు. అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యమిస్తూ త్వరలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి బాలరాజు మాట్లాడుతూ దుర్గేష్ నాయకత్వంలో పార్టీ బలోపేతం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రత్నాబాయి, మాజీ ఎంపీ ఏజేవీ బుచ్చిమహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పంతం నానాజీ, పీసీసీ కార్యదర్శి ఎస్ఎన్ రాజా, పార్టీ నేతలు కామన ప్రభాకరరావు, డోకల మురళి, రామినీడు మురళి, ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.